NARI SHAKTI DESI TWITTER HAILS VIRAL VIDEO OF ALL WOMAN RAILWAYS TEAM IN MAHARASHTRA MK GH
Viral Video: మహారాష్ట్ర రైల్వే మహిళా ఉద్యోగులపై ప్రశంసలు జల్లు.. 'నారీ శక్తి' అంటూ అభినందనలు
Video grab of all-woman team fixing freight trains. (Twitter)
మహారాష్ట్ర మహిళా రైల్వే ఉద్యోగులు. గూడ్స్ రైళ్లల్లో అండర్ గేర్ పరీక్ష, ఎయిర్ బ్రేక్ టెస్టింగ్ లాంటి కఠినమైన పనులను వారు సులువుగా చేస్తూ.. మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు. ఈ బృందం విధులు నిర్వహిస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
మహిళలు సౌమ్యంగా ఉంటారు.. శారీరకంగా కష్టంగా ఉండే పనులు వారి చేయలేరు అనే అపనమ్మకం చాలామందిలో ఉంటుంది. కానీ ఈ అభిప్రాయం తప్పని నిరూపిస్తూ, అన్ని రంగాల్లోనూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు నేటి తరం అతివలు. ఈ కోవకే చెందుతారు మహారాష్ట్ర మహిళా రైల్వే ఉద్యోగులు. గూడ్స్ రైళ్లల్లో అండర్ గేర్ పరీక్ష, ఎయిర్ బ్రేక్ టెస్టింగ్ లాంటి కఠినమైన పనులను వారు సులువుగా చేస్తూ.. మహిళా శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు. ఈ బృందం విధులు నిర్వహిస్తున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ 'నారీ శక్తి' పేరుతో ఈ వివరాలను ట్వీట్ చేశారు. మహారాష్ట్ర గూడ్స్ యార్డ్ లో మహిళా రైల్వే బృందం అండర్ గేర్ ఎగ్జామినేషన్, ఎయిర్ బ్రేక్ టెస్టింగ్, అండర్ ఫ్రేమ్స్, సైడ్ ప్యానెల్స్&గూడ్స్ రైళ్లకు సంబంధించిన వివిధ పనుల చేస్తూ తామేంటో నిరూపించింది. ఈ పనుల కోసమే ఈ బృందాన్ని నియమించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కొంత మంది రైల్వే మహిళా ఉద్యోగులు వివిధ రకాల పనులు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Nari Shakti: An all women team was formed to undertake intensive examination of freight trains at Kalyan Goods Yard in Maharashtra.
The team is deployed for under gear examination, air brake testing, examination of under frames, side panels & for on rake attention. pic.twitter.com/MquNwx6RmM
సోషల్ మీడియాలో విశేష స్పందన..
కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ పోస్ట్ చేసిన ఈ వీడియోను ట్విట్టర్‌లో 65 వేల మంది చూశారు. దాదాపు 8 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను చూసినవారు విశేషంగా స్పందిస్తున్నారు. "సేఫ్టీని నిర్దారించడంలో వీళ్లు చాలా గొప్పగా పనిచేస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నా" అని ఓ యూజర్ కామెంట్ రాశారు. "మహిళలు చిత్తశుద్ధి గలవారు, కష్టపడి పనిచేస్తారు" అని మరోకరు రాశారు. ‘ఇది చాలా మంచి ఆరంభం, టెక్నికల్ అర్హత సాధించిన మహిళలకు అవకాశం కల్పించడం మరో ముందడుగు’ అని ఇంకొకరు పోస్ట్ పెట్టారు. తమ అభిరుచి, ఆసక్తి మేరకు వీరు చాలా బాగా పనిచేస్తున్నారని, పనిని ఎంజాయ్ చేస్తున్నారని మరోకరు కామెంట్ పెట్టారు.
మోదీ మన్ కీ బాత్..
ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భారత రైల్వేకు చెందిన 'నారీ శక్తి' గురించి ప్రస్తావించారు. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్నప్పుడు అవసరమైన కీలక వైద్య సాయం, ఆక్సిజన్ రవాణా చేసిన ఆల్ ఉమెన్ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లోకోపైలట్ శిరీషా గజనితో మోదీ మాట్లాడారు. ఆమె పనితీరును ప్రశంసించారు. కోవిడ్-19పై చేస్తోన్న పోరాటంలో ఆమెలాంటి మహిళలు కీలక పాత్ర పోషించారని అన్నారు. శిరీషను తన ప్రేరణ ఎవరని ప్రధాని అడగ్గా.. తల్లిదండ్రుల నుంచి వచ్చిందని బదులిచ్చింది. మెడికల్ ఆక్సిజన్ ను రవాణా చేసే మిషన్ లో పనిచేసే అవకాశం తనకు రావడం పట్ల శిరీష ఆనందం వ్యక్తం చేసింది.