Home /News /trending /

NARENDRA MODI AS GLOBAL LEADER PHOTO TAKEN DURING QUAD CONFERENCE GOES VIRAL KNOW DETAILS HERE GH VB

Quad Summit | PM Modi: క్వాడ్ సదస్సు సందర్భంగా తీసిన ఓ ఫోటో వైరల్.. గ్లోబల్ లీడర్ గా మోదీ అంటూ..

వైరల్ గా మారిన ఫొటో ఇదే

వైరల్ గా మారిన ఫొటో ఇదే

క్వాడ్ నాయకుల ఇన్-పర్సన్ మీటింగ్‌ ముగిసిన తర్వాత ఒక విశేషం చోటుచేసుకుంది. సమావేశం అనంతరం మెట్లు దిగుతున్న ఇతర దేశాల నాయకులతో పాటు మోదీ ఉన్నారు. అయితే అందరు నేతల్లో మోదీ ముందు ఉండటం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

క్వాడ్(Quad) కూటమి సదస్సులో(Summit) పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్‌కు(Japan) వెళ్లిన విషయం తెలిసిందే. టోక్యోలో(Tokyo) జరిగిన సదస్సులో అమెరికా అధ్యక్షుడు(USA President), జపాన్, ఆస్ట్రేలియా(Australia) ప్రధానులతో పాటు భారత ప్రధాని మోదీ పాల్గొన్నారు. క్వాడ్ నాయకుల ఇన్-పర్సన్ మీటింగ్‌(Meeting) ముగిసిన తర్వాత ఒక విశేషం చోటుచేసుకుంది. సమావేశం అనంతరం మెట్లు దిగుతున్న ఇతర దేశాల నాయకులతో పాటు మోదీ(Modi) ఉన్నారు. అయితే అందరు నేతల్లో మోదీ ముందు ఉండటం స్పెషల్‌ అట్రాక్షన్‌గా(Special Attraction) నిలిచింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది.

Explained: QUAD అంటే ఏంటి..? చైనా దూకుడును అడ్డుకోవడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమా..? 


దేశాధినేతల్లో మోదీ అందరికంటే ముందు ఉండటం చూసిన నెటిజన్లు.. ఇది ‘పిక్చర్ ఆఫ్ ద డే’ అంటూ ఫోటోను ట్రెండింగ్‌లో నిలుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదతో కలిసి మెట్లు దిగి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి నడుస్తున్నట్లు ఫోటోలో చూడవచ్చు.



ఈ ఫోటోను షేర్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇతర సోషల్ మీడియా యూజర్లు ప్రధానమంత్రిని ‘గ్లోబల్ లీడర్’ అని కీర్తిస్తున్నారు. మోదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్‌లో ఫోటోను షేర్ చేశారు. ‘ప్రపంచాన్ని నడిపిస్తున్నారు.. ఒక ఫోటో వెయ్యి పదాలకు సమానమైనది’ అని ట్వీట్ చేశారు.



పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా తన ట్విట్టర్‌లో మోదీ ట్రెండింగ్ ఫోటోను షేర్ చేస్తూ.. హిందీలో ‘విశ్వ గురు భారత్’ అని రాశారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తున్న భారతదేశం అనే అర్థంతో చేసిన ఈ ట్వీట్‌ను చాలామంది రీ ట్వీట్ చేస్తున్నారు. బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఫోటోను షేర్ చేశారు. దీంతో పాటు ‘ప్రధాన సేవకుడికి మార్గం తెలుసు, నడిపించడం తెలుసు’ అని ట్వీట్‌లో రాశారు. దేవేంద్ర ఫడ్నవిస్ కూడా “గ్లోబల్ లీడర్” అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను ట్వీట్‌ చేశారు.



మరోవైపు, క్వాడ్ సదస్సులో ప్రసంగించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాడ్ కూటమి తక్కువ సయమంలోనే ప్రపంచంలో ముఖ్య స్థానాన్ని సంపాదించుకుందన్నారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్ రిజియన్ భద్రతపై నాలుగు దేశాధినేతలు చర్చించారు. క్వాడ్ పరిధి విస్తృతమైందని మోదీ పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని మోదీ వెల్లడించారు. క్వాడ్ సమావేశం అనంతరం జపాన్ ప్రధాని కిషిద, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Australia, Japan, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు