• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • NADIA ESSEX CATCHES CHEATING BOYFRIEND AFTER SMARTWATCH SHOWS HE BURNT 500 CALORIES AT 2 AM GH SSR

Cheating boyfriend: లవర్ ఎఫైర్‌ను ఫిట్‌నెస్ ట్రాకర్‌ పట్టించేసిందిగా.. ఆ టైంలో అన్ని కేలరీలు కరగడంతో కన్ఫామ్‌గా...

Cheating boyfriend: లవర్ ఎఫైర్‌ను ఫిట్‌నెస్ ట్రాకర్‌ పట్టించేసిందిగా.. ఆ టైంలో అన్ని కేలరీలు కరగడంతో కన్ఫామ్‌గా...

నదియా ఎస్సెక్స్

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్మార్ట్‌ టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు. వివిధ రకాల యాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్ లు చాలామంది జీవన విధానంలో భాగంగా మారాయి. ఇలాంటి సాంకేతికత లేకుంటే రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కూడా కష్టంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్ చేసేందుకు...

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు స్మార్ట్‌ టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు. వివిధ రకాల యాప్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్ లు చాలామంది జీవన విధానంలో భాగంగా మారాయి. ఇలాంటి సాంకేతికత లేకుంటే రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవడం కూడా కష్టంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్మార్ట్‌ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్ చేసేందుకు ఉపయోగపడతాయి. అనారోగ్యాల ప్రమాదాన్ని సైతం సెన్సార్ల సాయంతో ముందుగానే గుర్తించగలిగే ఫిట్‌నెస్ బ్యాండ్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇదే సాంకేతికత వ్యక్తులు దొంగచాటుగా చేసే పనులను గుర్తించగలుగుతుంది. తాజాగా తన ప్రియుడు చేసిన మోసాన్ని ఫిట్‌నెస్ ట్రాకర్ సాయంతో గుర్తించింది ఒక ఇంగ్లీష్ నటి. దీనికి సంబంధించిన వివరాలను ఆమె టిక్‌టాక్‌ వీడియోలో షేర్ చేసింది. ఇప్పుడిది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

హెల్త్ ట్రాకర్‌, వర్కవుట్ రోటీన్‌ను తనిఖీ చేసేకునేందుకు సహాయపడే స్మార్ట్ వాచీల్లో ఎన్నో ఫీచర్లు ఉంటున్నాయి. ఇద్దరి ఫిట్ నెస్ ట్రాకర్లను ఒకటే డివైజ్ కి సింక్ చేసే సదుపాయం కూడా ఉంది. దీనివల్ల డేటా మొత్తం ఒకే దగ్గర పొందే వీలుంటుంది. ఇది చాలామందికి సౌకర్యంగా కూడా ఉంటుంది. తాజాగా దీని సాయంతోనే ప్రియుడి మోసాన్ని గుర్తించింది నదియా ఎస్సెక్స్ అనే ఇంగ్లీష్‌ నటి.

టిక్‌టాక్‌లో ఒక అభిమాని ఆమెను రిలేషన్‌షిప్ ఎలా బ్రేకప్ అయ్యిందని అడిగినప్పుడు.. నదియా ఈ వివరాలు వెల్లడించింది. ‘ఒకరోజు నా మాజీ ప్రియుడు స్నేహితులతో నైట్ అవుట్‌కు వెళ్లాడు. ఉదయాన్నే ఇంటికి వచ్చాడు. ఆ రోజు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసేటప్పుడు ఫిట్ బిట్ బ్యాండ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. గత అర్ధ రాత్రి రెండు నుంచి మూడు గంటల సమయంలో అతడు సుమారు 500 క్యాలరీల శక్తిని కరిగించాడని దాంట్లో ఉంది. ఆ సమయంలో అతడు నాతో లేడు. అంతే... ఆ తరువాత జరగాల్సింది జరిగింది. అతడితో రిలేషన్‌షిప్ బ్రేకప్ అయిపోయింది’ అని ఆమె వివరించింది.

నదియా టిక్‌టాక్ వీడియో కోసం క్లిక్ చేయండి

నదియా పూర్తి వివరాలను వెల్లడించకపోయినా.. అంతకు ముందు రాత్రి అతడు మరో యువతితో గడిపినట్లు.. రాత్రి ఆ సమయంలో క్యాలరీలు కరిగించడం వల్ల తను సులభంగా తెలుసుకోగలిగిందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రియుడు చేసిన మోసాన్ని ఆమె తెలివిగా గ్రహించిందని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. టిక్‌టాక్‌లో ఈ వీడియోను లక్షల మంది చూస్తున్నారు. వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. యూట్యూబ్‌లో టిక్‌టాక్‌ అధికారిక ఛానెల్ ఈ వీడియోను షేర్ చేసింది.

నదియా ఎస్సెక్స్ బ్రిటన్ టీవీ నటి. ఆమె సెలబ్స్ గో డేటింగ్ అనే టీవీ సిరీస్‌లో నటించింది. డేటింగ్ ఎక్స్‌పర్ట్‌గా ఆమెకు మంచి పేరుంది. టిక్‌టాక్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఘటనతో ఫిట్‌నెస్‌ ట్రాకర్లు ప్రియుడిపై నిఘా పెట్టేందుకు కూడా ఉపయోగపడతాయని నదియా నిరూపించినట్లు అయ్యింది.
Published by:Sambasiva Reddy
First published: