తల్లిపై కుమారుడి ప్రేమ.. మెచ్చి కారు గిఫ్ట్ ఇస్తానన్న ఆనంద్ మహీంద్రా..

ఓ తల్లిపై కుమారుడు చూపించిన ప్రేమకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. తల్లిని స్కూటర్‌పై దేశమంతా తిప్పుతున్నాడని ఆశ్చర్యపోయి తనవంతుగా ఆయనకు ఓ కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఓ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని.. సందేశం కూడా పంపాడు.

news18-telugu
Updated: October 23, 2019, 1:24 PM IST
తల్లిపై కుమారుడి ప్రేమ.. మెచ్చి కారు గిఫ్ట్ ఇస్తానన్న ఆనంద్ మహీంద్రా..
ఆనంద్ మహీంద్రా
  • Share this:
ప్రపంచంలో తల్లి ప్రేమ విలువకట్టలేనిది.. ఆమె రుణం తీర్చుకోవడం కుమారులకు, కూతుళ్లకు సాధ్యం కాదు.. తీర్చుకునే సందర్భం వస్తే అంతకుమించిన సదావకాశం ఇంకొకటి ఉండదు. అలాంటి అవకాశమే ఓ కుమారుడికి దక్కింది. తన తల్లి తనను కని, పెంచి పెద్దవాడ్ని చేసి.. ప్రయోజకుడిని చేసిందని ఆమె రుణం తీర్చుకుంటున్నాడు ఓ కుమారుడు. మైసూరుకు చెందిన దక్షిణామూర్తి కృష్ణ కుమార్ బ్యాంక్ ఉద్యోగి. అయితే.. తన తల్లి తనను పెంచడం కోసం ఇంట్లోనే తన జీవితాన్ని గడిపేసిందని.. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆకలి అనేదే తెలీకుండా నిత్యం వండిపెట్టిందని, తనకు సేవ చేసిందని.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఊరినే కాదు.. దేశాన్నే తన తల్లికి చూపించాలనుకున్నాడు. బ్యాంకు ఉద్యోగం మానేసి, తనకు ఉన్న 20 ఏళ్ల కిందటి బజాజ్ చెతక్‌పై దేశమంతా తిప్పుతున్నాడు. ఇప్పటికే 48100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన తల్లికి దేశంలోని ప్రముఖ ఆలయాలను చూపించాడు. ఇంకా వివిధ ప్రాంతాలకు వెళ్తూనే ఉన్నారు.

అయితే, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా చెంతకు చేరింది. అంతే.. తల్లిపై కుమారుడు చూపించిన ప్రేమకు ఆయన ఫిదా అయ్యారు. స్కూటర్‌పై దేశమంతా తిప్పుతున్నాడని ఆశ్చర్యపోయి తనవంతుగా ఆయనకు ఓ కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఓ కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని.. సందేశం కూడా పంపాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశారు. ‘ఇదో అందమైన కథ. తల్లిపై, దేశంపై ఉన్న ప్రేమ ఇది. అతడ్ని నన్ను కలిసేలా చేయండి. అతడికి మహీంద్రా కేయూవీ 100 ఎన్‌ఎక్స్‌టీ కారును బహుమతిగా ఇస్తా. తల్లీకుమారుడి తదుపరి పర్యటనలు ఆ కారులో సాగేందుకు వీలవుతుంది’ అని తన దాతృత్వాన్ని చాటారు. చాలా సందర్భాల్లో ఆనంద్ మహీంద్రా తన దాతృత్వాన్ని ప్రదర్శించారు.First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు