Home /News /trending /

MYSTERY VILLAGE IN POLAND WHERE ONLY GIRLS ARE BORN KNOW ONE HAVE MALE CHILD IN LAST 12 YEARS SK

OMG: సైన్స్‌కి కూడా అంతుచిక్కని మిస్టరీ..ఆ ఊర్లో అబ్బాయిలు పుట్టరు.. అందరికీ ఆడపిల్లలే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mysterious Village: ఏ కుటుంబంలో అయినా మగబిడ్డ పుడితే వారికి రివార్డు అందజేస్తామని అప్పట్లో మేయర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరక ఎవరికీ మగ సంతానం కలగలేదు.

    ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానికి కూడా అంతు చిక్కని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. సాధారణం కన్నా భిన్న పరిస్థితులు ఉంటాయి. అసలు ఎందుకలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. శాస్త్రవేత్తలకు కూడా అర్ధం కాదు. ఒకవేళ అది మంచి అయితే... అద్భుతమని, చెడు అయితే శాపమని ప్రజలు అంటుంటారు. పోలాండ్‌లోని ఓ పల్లెటూరు (Poland Mysterious Village) కూడా సైన్స్‌కు సవాల్ విసురుతోంది. ఆ ఊర్లో మగ పిల్లలు పుట్టరు. ఎవరైనా మహిళ గర్భం దాల్చితే.. వారి కడుపులో ఆడ పిల్లలు మాత్రమే (Only Girls Village) పుడతారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. గత పన్నెండేళ్లుగా ఇదే జరుగుతుంది. ఈ పన్నెండేళ్లలో ఒక్క మగపిల్లాడు కూడా పుట్టలేదు. దీనికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. కానీ ఇది పూర్తిగా నిజం. పెద్ద శాస్త్రవేత్తలు కూడా దీని రహస్యాన్ని ఛేదించలేకపోయారు.

    ఈ మిస్టరీ విలేజ్ పోలాండ్ దేశంలో ఉంది. దాని పేరు మిజెస్కే ఓడ్ర్జెన్స్కీ. ఇక్కడ పన్నెండేళ్లుగా ఒక్క అబ్బాయి కూడా పుట్టలేదు. ఇక్కడ గర్భం దాల్చిన స్త్రీలంతా ఆడపిల్లలకే జన్మనిస్తారు. దీనికి కారణమేంటో సైన్స్‌కు కూడా తెలియడం లేదు. ఎవరికైనా కొడుకు పుడితే భారీ పారితోషికం ఇస్తామని... 2019లో ఈ గ్రామ మేయర్ ప్రకటించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ పారితోషికం అందుకోలేదు. ఎందుకంటే ఎవరికీ మగబిడ్డ పుట్టలేదు.

    Viral News: పార్టీ కోసం వెళ్లిన యువతి.. కానీ విమానంలో సీన్ రివర్స్.. అదో చేదు జ్ఞాపకం..

    మిజెస్కే ఓడ్ర్జెన్స్కీ గురించి గతంలో పలు వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి శాస్త్రవేత్తలు ఇదో పుకారని కొట్టిపారేశారు. కానీ ఆ తర్వాత.. నిజమని తెలిసింది. ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ గ్రామానికి వెళ్లి పరిశోధనలు చేశారు. చాలా మంది జర్నలిస్టుల కూడా వచ్చి ఇక్కడికి వచ్చి రిపోర్టు చేశారు. కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎవరూ ఛేదించలేకపోయారు. ఎందుకిలా జరుగుతుందో.. గ్రామంలోని మహిళలకు ఆడపిల్లలు ఎందుకు పుట్టడం లేదో.. ఎవరికీ అర్ధం కావడం లేదు.

    ఓ విద్యార్థి టీచర్ కు సమర్పించిన అపాలజీ లెటర్ చూస్తే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు రావాల్సిందే

    మిజెస్కే ఓడ్ర్జాన్స్కీ గ్రామంలో సుమారు మూడు వందల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ ఆడపిల్లలే పుడతారని స్థానికంగా జరిగిన ఓ పోటీ ద్వారా యావత్ ప్రపంచానికి వెల్లడైంది. ఏ కుటుంబంలో అయినా మగబిడ్డ పుడితే వారికి రివార్డు అందజేస్తామని అప్పట్లో మేయర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరక ఎవరికీ మగ సంతానం కలగలేదు. ఇలా ఎందుకు జరుగుతుందన్నది ఇప్పటి వరకు చేసిన పరిశోధనల్లో మాత్రం తేలలేదు. ఇక్కడి మహిళలకు మగబిడ్డలు ఎందుకు కలగడం లేదో.. వెతికే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. త్వరలోనే ఈ మిస్టరీని చేధిస్తామని చెబుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International news, Poland, Trending, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు