• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MYSTERY OF FOUR HORNED ANIMALS SOLVED HERE THE DETAILS GH SRD

Four horned animals: వీడిన నాలుగు కొమ్ముల మేకలు, గొర్రెల మిస్టరీ... అదే కారణం..

Four horned animals: వీడిన నాలుగు కొమ్ముల మేకలు, గొర్రెల మిస్టరీ... అదే కారణం..

వీడిన నాలుగు కొమ్ముల మేకలు, గొర్రెల మిస్టరీ... అదే కారణం..

Four horned animals: సాధారణంగా వివిధ రకాల పశువులు, అడవి జంతువులు, మేకలు, గొర్రెలకు రెండే కొమ్ములు ఉంటాయి. కానీ బొవిడే కుటుంబానికి చెందిన కొన్ని జంతువులకు రెండుకంటే ఎక్కువ కొమ్ములు ఉంటాయి.

  • Share this:
సాధారణంగా వివిధ రకాల పశువులు, అడవి జంతువులు, మేకలు, గొర్రెలకు రెండే కొమ్ములు ఉంటాయి. కానీ బొవిడే కుటుంబానికి చెందిన కొన్ని జంతువులకు రెండుకంటే ఎక్కువ కొమ్ములు ఉంటాయి. ఇలాంటి కొన్ని రకాల జంతువులను మనుషులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మచ్చిక చేసుకున్నారు. సాధారణంగా కొండ ప్రాంతాల్లో నివసించే మేకలు, గొర్రెలకు రెండుకంటే ఎక్కువ కొమ్ములు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. వీటిని పాలీసెరేట్లు అంటారు. ఈ జంతువుల ఉనికి వందల ఏళ్ల క్రితం నుంచే ఉంది. కానీ నాలుగు కొమ్ముల జంతువుల పరిణామ క్రమానికి జన్యుపరమైన కారణాలను ఇప్పటివరకు కనుక్కోలేకపోయారు. కొన్ని జాతుల్లో ప్రత్యేకంగా నాలుగు కొమ్ములు ఎందుకు ఉంటాయనే వివరాలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఇందుకు దోహదం చేసే జన్యువుల విధులను వెల్లడించారు.ఈ పరిశోధన కోసం రెండు వేలకు పైగా మేకలు, గొర్రెల జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ఈ మిస్టరీకి ఒక జన్యువు కారణమని తేల్చారు. పాలీసెరేట్ జాతి జంతువులన్నీ ప్రత్యేక జన్యువులతో ఉన్నాయని కనుగొన్నారు. ఈ జన్యువును ప్రభావితం చేసే ఉత్పరివర్తనాన్ని వారు గుర్తించారు.

* ఆ జన్యువే కారణం  

HOXD1 అనే హోమియోటిక్ జన్యువు వల్ల కొన్ని జంతువుల్లో నాలుగు కొమ్ములు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. జంతువులు పిండ దశలో ఉన్నప్పుడు.. వాటి శరీరం అభివృద్ధి చెందే దశలను ఈ జన్యువు ప్రభావితం చేస్తుంది. గొర్రెలు, మేకల్లో ఈ ఉత్పరివర్తనం భిన్నంగా ఉంటుందని కనుగొన్నారు. కానీ నాలుగు కొమ్ములు ఉండే గొర్రెలు, మేకల్లో ఒకేరకమైన జన్యువు ఉంటుందని గుర్తించారు. ఉత్పరివర్తనం వల్ల ఈ జన్యువు ఉత్పత్తి చేసే HOXD1 ప్రోటీన్ స్థాయులు తగ్గుతాయి. దీనివల్ల అదనంగా కొమ్ములు ఏర్పడతాయి.

* HOXD1 జన్యువు ప్రభావంతోనే.. 

జంతువుల్లో HOXD1 జన్యువు విధులను పరిశోధకులు తాజాగా గుర్తించారు. ఈ జన్యువు జంతువుల తలకు రెండు వైపులా కొమ్ములు పెరిగే ప్రాంతానికి హద్దులను ఏర్పరుస్తుందని కనుగొన్నారు. జన్యువు ఉత్పరివర్తనం జరిగినప్పుడు జన్యు ప్రోటీన్ తగ్గిపోయి.. కొమ్ములు పెరిగే ప్రాంతం విస్తరిస్తుంది. ఫలితంగా పిండం అభివృద్ధి చెందే సమయంలో కొమ్ము మొగ్గలు విడిపోతాయి. దీనివల్ల మరో జత కొమ్ములు పెరుగుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. హోమియోటిక్ జన్యువుల వల్ల ఇలా జరుగుతుందని మొదటిసారి గుర్తించారు. బోవిడే జాతి జంతువుల రూపం, పరిమాణంతో పాటు జన్యువుల పరిణామ క్రమం మారి ఉండవచ్చని తెలిపారు. కొమ్ములు వస్తున్న కచ్చితమైన ప్రాంతాన్ని, వాటి సంఖ్యను ఈ జన్యువులే నిర్ధారిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు