రెండు మాసాల్లోనే 350కి పైగా ఏనుగుల మృతి...మిస్టరీగా..

ఏనుగులు ఎందుకు చనిపోతున్నాయనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇది దక్షిణాఫ్రికా ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలను సైతం కలవరానికి గురి చేస్తోంది.

news18-telugu
Updated: July 2, 2020, 7:37 AM IST
రెండు మాసాల్లోనే 350కి పైగా ఏనుగుల మృతి...మిస్టరీగా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రెండు నెలల కాలంలో ఒక్కటీ కాదు రెండు కాదు.. ఏకంగా 350కి పైగా ఏనుగులు చనిపోయాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వానాలో చోటుచేసుకుంది. అయితే మే మాసం నుంచి ఇలా ఏనుగులు ఎందుకు చనిపోతున్నాయనే విషయం ఇప్పటివరకు మిస్టరీగా మిగిలిపోయింది. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో భారీ సంఖ్యలో ఏనుగుల మృతి చెందడానికి ఏదైనా వైరస్ కారణం కావచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  ఇది దక్షిణాఫ్రికా ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలను సైతం కలవరానికి గురి చేస్తోంది. యూకెకు చెందిన ఛారిటీ నేషనల్ పార్కు రెస్క్యూకు చెందిన డాక్టర్ నియాల్ మక్కాన్ మే నెల ప్రారంభంలో ఒవావాంగో డెల్టా ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూ 169 ఏనుగు కబేళాలను గుర్తించారు. దాదాపు మూడు గంటల పాటు చేసిన విమాన ప్రయాణంలో అధిక సంఖ్యలో ఏనుగులు అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం నెల రోజుల తర్వాత చేసిన పరిశోధనలో మరికొన్ని ఏనుగుల కబేళాలను  గుర్తించారు.

మొత్తంగా బొస్ట్వానా ప్రాంతంలో 350కి పైగా ఏనుగు కబేళాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో కరువు ఛాయలు లేనప్పటికీ ఇంత భారీ స్థాయిలో ఏనుగులు చనిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మే నెలలో ఏనుగులు చనిపోవడానికి వేటగాళ్లే కారణమని మొదట భావించారు. కానీ ఏనుగుల నుంచి దంతాలను తొలగించలేదు. దీంతో మరేదో కారణమై ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. అయితే బోస్ట్వానా ప్రాంతంలో ఏనుగులు మాత్రమే చనిపోతున్నాయి. వేరే జంతువులు చనిపోవడం లేదని, వేటగాళ్ల ఉపయోగించే సైనైడ్ అయితే ఇతర జంతువులు చనిపోయి ఉండాలని, కానీ అలా జరగలేదని డాక్టర్ నియాల్ మక్కాన్ వివరించారు. ఇదిలావుంటే.. గతేడాది బోస్ట్వానాలో ఆంత్రాక్స్ వ్యాధి వల్ల 100 ఏనుగులు చనిపోయాయి.

ఏనుగులకు కరోనా వైరస్ సోకి చనిపోయి ఉంటాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బొస్ట్వానా వన్యప్రాణి, జాతీయ ఉద్యాన వనాల డైరెక్టర్ డాక్టర్ సిరిల్ టావోలో గార్డియన్ దీనిపై స్పందిస్తూ ఇప్పటివరకు 280 ఏనుగులు చనిపోయినట్టు గుర్తించామని, మిగిలిన వాటిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. అయితే ఏనుగుల మరణానికి కారణం ఏంటి అన్నది తెలియలేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఏనుగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించామని, రాబోయే రెండు వారాల్లో ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
First published: July 2, 2020, 7:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading