• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MYSTERY DEATHS WHY 22 PEOPLE DIED IN JUST 5 DAYS IN ROHTAK VILLAGE OF HARYANA PEOPLE GET PANIK FOR IT NK

Mystery deaths: వామ్మో... 5 రోజుల్లో 22 మరణాలు.. ఆ ఊర్లో ఏం జరుగుతోంది?

Mystery deaths: వామ్మో... 5 రోజుల్లో 22 మరణాలు.. ఆ ఊర్లో ఏం జరుగుతోంది?

5 రోజుల్లో 22 మరణాలు.. ఈ ఊర్లో ఏం జరుగుతోంది? (image credit - twitter)

Mystery deaths: దేశంలో ప్రజలు కరోనా వల్ల చనిపోతున్నారు. మరి ఆ ఊర్లో మరణాలకు కారణం కరోనా కాదా? మరి ఆ మరణాలకు కారణమేంటి? కొత్త వైరస్ ఏదైనా ప్రవేశించిందా?

  • Share this:
    Mystery deaths: హర్యానా... రోహ్‌తక్ జిల్లాలో... తితోలీ (titoli) అనే ఊరు ఉంది. అక్కడ గత 5 రోజుల్లో 22 మంది చనిపోయారు. వారందరికీ జ్వరం వచ్చింది. జ్వరంతోనే చనిపోయారు. అందువల్ల స్థానికులు... వారంతా కరోనాతో చనిపోయారు అని అనుకుంటున్నారు. ఈ ఊరు... రోహ్‌తక్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 3,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇదివరకు ఈ ఊళ్లో ఎక్కడ చూసినా జనం ఉండేవారు. ఈ మరణాల తర్వాత ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు. సరిగ్గా 5 రోజుల కిందట... 11 మంది మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు. ఇలా ఎప్పుడూ జరగలేదు అని పార్మిలా సర్పంచ్ సురేష్ కుమార్ తెలిపారు. "చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఏం చెప్పారంటే... చనిపోయిన వారు రెండ్రోజులు జ్వరంతో బాధపడ్డారు. మూడోరోజు చనిపోయారు" అని చెప్పారని సురేష్ తెలిపారు.

    వారం నుంచి చనిపోయిన వారందరిలో ఒకే రకమైన లక్షణాలు కనిపించాయి. చనిపోయిన వారిలో ఏడుగురి వయసు 40 ఏళ్లలోపే అని సర్పంచ్ వివరించారు. ఈ విషయం తీవ్ర కలకలం రేపడంతో... జిల్లా యంత్రాంగం, ఆరోగ్య విభాగం రంగంలోకి దిగాయి. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించాయి. స్థానికులు మరింత మంది చనిపోకూడదు అనే ఉద్దేశంతో రకరకాల క్షుద్రపూజల వంటివి చేస్తున్నారు.

    Mystery deaths, rohtak village of haryana, titoli village, mysterious deaths, fever deaths, covid 19 deaths, viral news, shockin news, వింత మరణాలు, వింత వ్యాధి, కరోనా లాంటి వ్యాధి,
    5 రోజుల్లో 22 మరణాలు.. ఈ ఊర్లో ఏం జరుగుతోంది? (image credit - twitter)


    సర్పంచ్ చెప్పినట్లు 11 మంది కాదనీ... 22 మంది చనిపోయారని... తితోలీ గ్రామంలో పాల వ్యాపారి జగదీష్ కుమార్ చెప్పారు. ఇంత మంది చనిపోతున్నా... జిల్లా ఆరోగ్య విభాగం వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కుమార్ ఆరోపించారు.

    అధికారులేమో... ప్రజలు గుమికూడి హుక్కా తాగవద్దనీ, గుంపులుగా కూర్చొని పేకాటలు ఆడవద్దని ఆ గ్రామస్థులకు సూచించారు. అధికారుల ఆదేశాలతో ఓ డాక్టర్ల బృందం హడావుడిగా గ్రామానికి వచ్చింది. కొన్ని గంటల తర్వాత తిరిగి వెళ్లిపోయింది. ఆ బృందం చేసిందేమీ లేదని స్థానికులు అంటున్నారు.

    గత నాలుగైదు రోజులుగా అనుమానాస్పద స్థితిలో ప్రజలు చనిపోతున్న విషయం మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు చేస్తున్నాం అని తితోలీ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సోంబీర్ దహియా తెలిపారు. ఇంతకీ వారంతా ఎందుకు చనిపోయారన్నది తెలియలేదు. కరోనాతో చనిపోయి ఉంటే... మూడు రోజుల్లోనే చనిపోవడమేంటి అన్నది షాకింగ్ విషయం. కరోనా కాకపోతే... మరి ఎందుకు చనిపోయారో తెలియాలి. ఆరోగ్య విభాగంలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ బిర్లా... త్వరలోనే సీనియర్ మెడికల్ ఆఫీసర్ ద్వారా తమకు రిపోర్ట్ వస్తుందనీ... దాన్ని బట్టీ... కారణమేంటో తెలుస్తుందని అంటున్నారు.

    ఇది కూడా చదవండి: Inspiration: ఆ మహిళల ఘనత. లాక్‌డౌన్‌లో 6 లక్షల మాస్కులమ్మి రూ.30లక్షల సంపాదన

    అది కరోనానా లేక... మరేదైనా కొత్త వైరస్ వచ్చిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అది ఏదైనా సరే... అంత మంది అంత త్వరగా చనిపోవడం అనేది ఆందోళన కలిగిస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు