Mystery : పొలంలో క్రాప్ సర్కిల్... ఎలా వచ్చింది? ఎవరు వేశారు?

దశాబ్దాలుగా ఈ క్రాప్ సర్కిల్స్ అనేవి రహస్యాలు గానే ఉంటున్నాయి. అంత పెద్ద సర్కిల్ ఎవరికీ తెలియకుండా ఎలా వెయ్యగలుగుతున్నారు?

news18-telugu
Updated: July 14, 2020, 6:31 AM IST
Mystery : పొలంలో క్రాప్ సర్కిల్... ఎలా వచ్చింది? ఎవరు వేశారు?
పొలంలో క్రాప్ సర్కిల్... ఎలా వచ్చింది? ఎవరు వేశారు? (credit - twitter)
  • Share this:
ఈమధ్య కాలంలో మిస్టీరియస్ క్రాప్ సర్కిల్స్ అంశంపై చర్చ జరగట్లేదు. తాజాగా మరో క్రాప్ సర్కిల్ కనిపించడంతో... మళ్లీ చర్చ మొదలైంది. జనరల్‌గా అమెరికా, యూరప్ దేశాల్లోని పొలాల్లో ఈ భారీ క్రాప్ సర్కిల్స్ అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి. పొలాల్లో ఎవరో దగ్గరుండి పద్ధతిగా చెక్కి మరీ ఆకారాలు వేస్తున్నట్లు ఉంటున్నాయివి. వీటిని ఎవరు వేస్తున్నారో, ఎలా వేస్తున్నారో, ఎందుకు వేస్తున్నారో ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేకపోవడం ఆశ్చర్యకర విషయం. 1980లో కొలిన్ ఆండ్రూస్... వీటికి క్రాప్ సర్కిల్స్ అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి వీటిని అందరూ అలాగే పిలుస్తున్నారు.


గ్రహాంతర వాసుల పనేనా:
ఎక్కువ మంది అంచనా ఏంటంటే... ఇవి గ్రహాంతర వాసుల పనే అని. ఎందుకంటే... ఇంత పెద్ద సర్కిల్స్‌ని ఇంత గుండ్రంగా... పద్ధతిగా వెయ్యడం మనుషుల వల్ల కాదని అంటున్నారు. పైగా... అతి తక్కువ సమయంలో ఏ యంత్రాలూ లేకుండా ఇలా ఎలా వేయగలరన్న ప్రశ్న కూడా ఉంది. గ్రహాంతర వాసులే... భారీ ఫ్లైయింగ్ సాసర్లతో పొలాల్లో ల్యాండ్ అవుతున్నారనీ... ఆ ఫ్లైయింగ్ సాసర్ల వల్లే ఇలాంటి అచ్చులు పడుతున్నాయనే వాదన ఉంది. కానీ ఇందుకు ఒక్క ఆధారమూ లేదు.

2002లో సైన్స్ (signs) అనే మూవీ తీశారు నైట్ శ్యామలన్. ఇందులో అమెరికాలోని ఓ ఫ్యామిలీకి చెందిన పొలాల్లో క్రాప్ సర్కిల్స్ ఏర్పడతాయి. తాజాగా ఇప్పుడు ఉత్తర ఫ్రాన్స్‌లోని పొలంలో భారీ క్రాప్ సర్కిల్ కనిపించడం కలకలం రేపింది. దాన్ని చూసేందుకు వేల మంది తరలివచ్చారు. జులై 5న ఇది కనిపించింది. అప్పటి నుంచి దీన్ని చూసేందుకు రోజూ ప్రజలు వస్తూనే ఉన్నారు. జులై 5న పొలం యజమాని గెరార్డ్ బెనాయిట్... ట్రాక్టర్ తోలుతూ... తన గోధుమ పంటను ఎవరో కోసినట్లుగా గమనించారు. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే... అదేదో ఆకారంలా ఆయనకు అనిపించింది. ఆ తర్వాత అది గుండ్రంగా ఉందని గుర్తించారు. రాత్రికి రాత్రి అది ఎలా ఏర్పడిందో ఆయనకు అర్థం కాలేదు.


ఈ క్రాప్ సర్కిల్‌ను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫ్యామిలీ. ఐతే... వందల మంది రోజు పొలానికి వస్తుంటే... చిరాకొచ్చి... ఆ ఫొటోలను తీసేసింది. పొలానికి వచ్చిన వాళ్లు అక్కడే ప్రార్థనలు చేస్తూ... దాన్నో చర్చిలా ఫీలవుతుంటే... లేనిపోని సమస్యలు తలెత్తుతున్నాయనుకుంటూ... ఆ కుటుంబం అలర్ట్ అయ్యింది. తమ పొలంలో ఇలాంటిది రావడం ఆశ్చర్యంగా ఉన్నా... దాని వల్ల తమకేమీ ప్రయోజనం లేదనీ... తమ పొలం పోయిందని అంటోంది ఆ ఫ్యామిలీ.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 6:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading