Mysterious Metal Monolith: అమెరికాలోని ఉటా ఎడారిలో కొన్ని రోజుల కిందట కనిపించిన లోహ స్తంభం (మోనోలిత్) ఇప్పుడు అక్కడ లేదు. అది ఏమైపోయిందో ఎవరికీ తెలియట్లేదు. ఉటా రాష్ర్టానికి చెందిన ఉటా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ రీసోర్సెస్ అధికారులు... ప్రజలు పెద్దగా తిరగని ఎడారిలో నవంబర్ 18న ఈ లోహ స్తంభాన్ని చూశారు. దాని చుట్టూ తిరిగారు. 10-12 అడుగుల ఎత్తు, మూడు వైపుల స్టీల్‌తో తయారైన ఆ స్తంభాన్ని అక్కడ ఎవరు పెట్టారో వాళ్లకు అర్థంకాలేదు. చాలా ఆశ్చర్యపోయారు. దాన్ని ఫొటోలు, వీడియోలూ తీశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మిస్టరీని ఛేదిస్తామని అధికారులు తెలిపారు. ఐతే శుక్రవారం సాయంత్రం తర్వాత ఆ స్తంభం కనిపించట్లేదని ఉటాకు చెందిన బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ (BLM) అధికారులు తెలిపారు. ప్రజలు మాత్రం అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఆ స్తంభాన్ని అక్కడి నుంచి అధికారులే తొలగించారనీ... దానికీ ఏలియన్స్‌కీ ఏదో సంబంధం ఉంది కాబట్టే... దాన్ని అధికారులు దాచేసి... పరిశోధనలు చేయబోతున్నారని అంటున్నారు. ఈ ఆరోపణలను అధికారులు ఖండించారు.
A mysterious metal monolith was discovered in Red Rock, Utah. It was spotted from the air by a passing helicopter crew out on a routine wildlife mission. It's unknown who put it there but it's a pretty cool art installation👌 pic.twitter.com/NE5o0h3QqT
అచ్చం ఆ సినిమాలో లాగే:
మీరు హాలీవుడ్ మూవీ 2001 ఏ స్పేస్ ఒడిస్సీ (2001: A Space Odyssey) చూశారా. అందులో సేమ్ ఇలాంటి లోహస్తంభమే ఉంటుంది. అంతరిక్షంపై తీసిన సినిమాల్లో ఈ సీనిమా ఓ సంచలనం అనుకోవచ్చు. ఇందులో... సినిమా ప్రారంభంలో ఓ ఎడారిలో...., ఇంటర్వెల్ సమయంలో చంద్రుడిపైనా... క్లైమాక్స్‌లో అంతరిక్షంలో ఈ లోహ స్తంభం కనిపిస్తుంది. ఇది కనిపించిన ప్రతిసారీ... మానవ సమాజం మరిన్ని ఎక్కువ తెలివితేటలతో... మరింత ఎక్కువ అభివృద్ధి సాధిస్తూ ఉంటుంది. ఆ లోహ స్తంభానికీ గ్రహాంతర వాసులకూ సంబంధం ఉన్నట్లుగా ఆ సినిమాని చిత్రీకరించారు. కానీ ఎక్కడా కూడా అందులో గ్రహాంతర వాసులు కనిపించరు. అలాగే... ఆ లోహ స్తంభం కూడా మిస్టరీ గానే ఉంటుంది. దాని ప్రేరణతోనే... ఎవరో కావాలనే ఇలా ఉటా ఎడారిలో చేశారనే వాదన వినిపిస్తోంది.
అధికారుల నిర్లక్ష్యమేనా?
ప్రపంచమంతా చర్చకు దారితీసిన లోహ స్తంభం ఎడారిలో కనిపించినప్పుడు... దాన్ని ఎవరూ ఎత్తుకెళ్లకుండా... దానిపై దర్యాప్తు జరపాల్సిన బాధ్యత అధికారులు, పోలీసులపై ఉంటుంది. కానీ అది ఇప్పుడు మాయమై... మరింత సస్పెన్స్ పెంచింది. ఉన్నారో లేదో తెలియని గ్రహాంతర వాసులే... దాన్ని పెట్టారనే కోణం తెరపైకి వస్తూ... ప్రజలను రకరకాలుగా ఆలోచించేలా చేస్తోంది. అధికారులు మాత్రం... అది ప్రభుత్వానిది కాదు కాబట్టి... తాము దాన్ని తొలగించలేదని చెబుతున్నారు.
Aliens? Artists? A mysterious metal monolith was just found in the Utah desert 👽 pic.twitter.com/JaUp3MimTc
2020 రీసెట్ బటన్ అనుకోవాలా?
ప్రస్తుతం 2020లో అన్నీ నష్టాలో చూస్తున్నాం. ప్రపంచ మానవాళి... అధివృద్ధి వెనక్కు వెళ్లిపోయింది. పేదరికం పెరిగింది. అందువల్ల ప్రపంచాన్ని మరో మెట్టు పైకి ఎక్కించేందుకే... ఆ లోహ స్తంభం వచ్చిందంటున్నారు కొందరు. స్పేస్ ఒడిస్సీ సినిమాలో అది కనిపించిన ప్రతిసారీ... ప్రపంచం ఎలాగైతే అభివృద్ధి వైపు వెళ్లిందో... ఇప్పుడు కూడా 2020 సమస్యలకు చెక్ పెట్టేందుకూ... ఆ స్తంభం రీసెట్ బటన్ లా వచ్చిందనే ప్రచారం సాగుతోంది.
మిస్టరీ వీడుతుందా?
లోహ స్తంభం రాక, పోక రెండూ మిస్టరీగానే మారాయి కాబట్టి గ్రహాంతర వాసులపై ఊహాతీత కథలు చెప్పేవారు... దీనిపై కూడా ఎన్ని స్టోరీలైనా చెప్పేందుకు వీలవుతోంది. ఆ లోహం ఉన్న చోటికి దగ్గర్లోనే రోడ్లు ఉన్నాయి. ఎవరో దాన్ని అక్కడ కావాలనే ఉంచి, మళ్లీ పట్టుకుపోయి ఉంటారంటున్నారు.
2011లో చనిపోయిన వ్యక్తిదా?
అమెరికా ఆర్టిస్ జాన్ మెక్ క్రాకెన్... అవంత్ గార్డె అనే వస్తువొకటి ఇదివరకు తయారుచేశాడు. అది అచ్చం ఇలాగే ఉంటుంది. ఆయన న్యూ మెక్సికోలో నివసించేవాడు 2011లో చనిపోయాడు. ఇది అదేనా అనే డౌట్ వస్తోంది కొందరికి. ఎందుకంటే... 2002లో ఆయన తన కొడుక్కి... తన లోహ స్తంబాన్ని... సుదూర ప్రాంతంలో ఉంచుతాననీ... తర్వాత దాన్ని ఎవరో ఒకరు కనిపెడతారని అన్నాడు. అందువల్ల ఆయనే దాన్ని ఇక్కడ పెట్టాడా అనే డౌట్ వస్తోంది. అదే నిజమైతే... ఎత్తుకుపోయిందెవరన్నది తేలాల్సిన అంశం.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.