టెక్సాస్‌లో వింత లైట్లు... గ్రహాంతర వాసులేనా?... వైరల్ వీడియో...

Eartha and Aliens : పెంటగాన్ UFO వీడియోలను విడుదల చేసిన తరువాత టెక్సాస్‌లో ఈ వింత లైట్లు కనిపించాయి.

news18-telugu
Updated: May 2, 2020, 12:00 PM IST
టెక్సాస్‌లో వింత లైట్లు... గ్రహాంతర వాసులేనా?... వైరల్ వీడియో...
టెక్సాస్‌లో వింత లైట్లు... గ్రహాంతర వాసులేనా?... వైరల్ వీడియో... (credit - Youtube)
  • Share this:
Eartha and Aliens : అమెరికా టెక్సాస్ ప్రజలు రాత్రివేళ కనిపించిన వింత లైట్లను చూసి టెన్షన్ పడ్డారు. ఆకాశంలో మూడు లైట్లు కాసేపు వెలిగి... తర్వాత అదృశ్యమయ్యాయి. అవి ఏంటన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఇటీవల అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్... ఇటీవల రెండు గుర్తించని ఎగిరే వస్తువుల (UFO)కు సంబంధించిన వీడియోలని రిలీజ్ చేసింది. అవి UFOలేనని తొలిసారిగా అధికారికంగా ప్రకటించింది. 2004 నుంచి 2015 మధ్య నేవీ పైలట్లు ట్రైనింగ్ ఫ్లైట్లలో వెళ్తున్నప్పుడు ఈ దృశ్యాలు కనిపించినట్లు తెలిసింది. అవి ఏంటన్నది మాత్రం స్పష్టం చెయ్యలేదు. కాకపోతే... కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆ వీడియోల ఫుటేజ్‌లు నిజమేనని పెంటగానే చెప్పడం ద్వారా కన్ఫామ్ అయ్యింది.


తాజాగా టెక్సాస్‌లో కనిపించిన వింతలైట్లను ప్రజలు వీడియో తీశారు. వాటిలో ఓ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. 37 సెకండ్ల ఆ వీడియోలో... మూడు లైట్ల లాంటివి ఆకాశంలో వెలుగుతూ కనిపించాయి. అవి UFOలే (ఎగిరే పళ్లాలు, గ్రహాంతర వాసుల వాహనాలు) అంటున్నారు చాలా మంది. దీనిపై నెవాడా సెనేట్ మాజీ డెమొక్రటిక్ నాయకుడు హ్యారీ రీడ్ ట్వీట్ చేశారు.
కొన్నేళ్ల కిందట నెవాడాలో ఇలాగే ఓ కాంతి కనిపించింది. టెక్సాస్‌లో ఇలాంటివి రావడం ఈ సంవత్సరంలో ఇది మూడోసారి. టెక్సాస్‌లోని టోంబాల్ నగరంపై ఆకాశంలో రాత్రి వేళ ఇవి కనిపిస్తున్నాయి. నెమ్మదిగా కదులుతున్నాయి. అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత మళ్లీ కనిపిస్తున్నాయి. వీటిని చూసి ప్రజలు ఒకింత భయపడుతున్నారు.

మొత్తానికి గ్రహాంతరవాసుల మనుగడపై చర్చ తిరిగి ప్రారంభమైంది. ఈ చర్చ మధ్యలో భాగంగా అమెరికాలోని టెక్సాస్ ఆకాశంలో మూడు వింత లైట్ల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. వాటిని UFOలు అని పిలుస్తున్నారు.

UFOలు ఉన్నాయని అమెరికాయే స్వయంగా ఒప్పుకోవడంతో... గ్రహాంతర వాసులు ఉన్నారా... మనుషుల్ని కలిశారా... అన్న ప్రశ్నలు మళ్లీ మొదలయ్యాయి. అమెరికా... నెవాడాలోని ఏరియా 51 మిలిటరీ టెస్టింగ్ గ్రౌండ్‌లో ఏలియన్స్ (గ్రహాంతర వాసులు)పై పరిశోధనలు జరుగుతున్నాయని యూఫాలజిస్టులు చెబుతున్నారు. అమెరికా మాత్రం ఏనాడూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
First published: May 2, 2020, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading