Home /News /trending /

MYSTERIOUS FAST RADIO BURSTS FROM SPACE ARE THERE ALIENS

అంతరిక్షంలో అక్కడ ఏలియన్స్ ఉన్నారా? భూమివైపు వస్తున్న ఆ తరంగాలపై నాసా ఏం చెబుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎలా ఉన్నారు? మనలాగే ఉన్నారా? లేక స్టార్ వార్స్ సినిమాలోలా వింత ఆకారాల్లో ఉన్నారా? వంటి ప్రశ్నలు శతాబ్దాలుగా మనకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికేలా ఉంది. విశ్వంలో సుదూర ప్రాంతం నుంచీ వస్తున్న తరంగాలు శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యంలో పడేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
ఫాస్ట్ రేడియా బరస్ట్ (FRB)... ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో దీని గురించి విపరీతమైన చర్చ జరగబోతోంది. ప్రపంచ రోదశీ పరిశోధకులంతా దీని గురించి మాట్లాడే రోజులు రాబోతున్నాయి. అందుకు బలమైన కారణాలున్నాయి. FRBని అత్యంత శక్తిమంతమైన రేడియో తరంగ పేలుడు అని పిలుస్తున్నారు. 2001 జులై 24న తొలిసారిగా భూమివైపు ఇలాంటి తరంగం ఒకటి వచ్చింది. సెకండ్ కంటే తక్కువ సమయంలో వచ్చిన ఆ తరంగం దానంతట అది రాలేదనీ, ఎవరో అత్యంత భారీ పేలుడు సృష్టిస్తే అందులోంచీ పుట్టిన ఓ తరంగం భూమివైపు వచ్చిందని ఖగోళ శాస్త్రవేత్త డంకన్ లోరిమెర్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఆ తరంగం ఎలా పుట్టిందో, ఎక్కడి నుంచీ వచ్చిందో నాసా శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాలేదు. కానీ దానిపై ఓ కన్నేసి ఉంచారు. అప్పటి నుంచీ అప్పుడప్పుడూ FRBలు భూమివైపు వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచీ వస్తున్నాయో తీగలాగితే.... ఎక్కడో సుదూర విశ్వంలో 300 కోట్ల కాంతి సంవత్సరాల అవతల ఉన్న అత్యంత శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రం (మాగ్నెటిక్ ఫీల్డ్) లేదా గెలాక్సీ (పాలపుంత) నుంచీ అవి వస్తున్నాయని అర్థమైంది. అక్కడ వేగంగా తిరుగుతున్న నక్షత్రం నుంచి గానీ... లేదా బ్లాక్ హోల్ లేదా గ్రహాంతర వాసుల నుంచీ అవి వస్తున్నట్లు అనుమానాలున్నాయి. FRBలన్నీ ఒకే వైపు నుంచీ వస్తుండటం వల్ల అక్కడ గ్రహాంతర వాసులు ఉండి ఉండొచ్చని నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో సహా చాలా అంతరిక్ష పరిశోధనా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటివరకూ 60కి పైగా FRBలు భూమివైపు వచ్చాయి.

గ్రహాంతర వాసులు, ఏలియన్స్, FRB, NASA, ISRO, frb full form, radio wave, fast radio burst, frb canada, frb in space,
ప్రతీకాత్మక చిత్రం


మన ఊహలకు అందనంత టెక్నాలజీ: శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు FRBలను గ్రహాంతరవాసులే పంపిస్తున్నట్లైతే... వాళ్ల టెక్నాలజీకి మనం ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే... ఒక FRBని పంపాలంటే.... మన భూమి కంటే డబుల్ సైజ్ ఉన్న బాంబుని పేల్చాలి. అది బాంబు కావచ్చు, రాకెట్ ప్రయోగం ద్వారా విడుదలయ్యే శక్తి కావచ్చు, స్పేస్ షిప్‌ బయలుదేరడానికి విడుదలయ్యే ఎనర్జీ కావచ్చు... ఏదైనా కావచ్చు. అంత భారీ పేలుడు జరిగితేనే ఈ తరంగాలు పుడతాయి. ఈ తరంగాల శక్తి ఇంత ఉంటుంది అని చెప్పడానికి కూడా కష్టమైపోతోంది శాస్త్రవేత్తలకి. మన సూర్యుడు 10 వేల సంవత్సరాల్లో విడుదల చేసే శక్తిని, ఈ తరంగాలు జస్ట్ మిల్లీ సెకండ్‌లో ఉత్పత్తి చేస్తాయంటే నమ్మగలరా? అంటే ఈ తరంగం పుట్టిన చోట, ఎంద పెద్ద పేలుడు సంభవిస్తోందో అంచనా వేసుకోవచ్చు.

గ్రహాంతర వాసులు, ఏలియన్స్, FRB, NASA, ISRO, frb full form, radio wave, fast radio burst, frb canada, frb in space,
ప్రతీకాత్మక చిత్రం


మెదళ్లను తొలిచేస్తున్న ఎన్నో ప్రశ్నలు: అంత భారీ తరంగాలు ఎలా పుడుతున్నాయి? అవి అంత దూరం నుంచీ భూమివైపు చెల్లా చెదురు కాకుండా ఎలా వస్తున్నాయి? ఆ తరంగాల్ని సృష్టిస్తున్నది ఎవరు? వాటితో ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు? విశ్వంలో ఓ చోటి నుంచీ మరో చోటికి వెళ్లే క్రమంలో... జరుపుతున్న పేలుళ్ల వల్ల ఈ తరంగాలు పుడుతున్నాయా? లేక నక్షత్రాలు అంతమవుతున్నప్పుడు ఏర్పడే సూపర్ నోవా పేలుళ్ల వల్ల ఇవి పుట్టుకొస్తున్నాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు శాస్త్రవేత్తలకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. మనం బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గేర్ వాడతాం. తద్వారా బలమైన శక్తి బైక్‌ని ముందుకు నెడుతుంది కదా. అలాగే ఏలియన్స్, దాదాపు 10 లక్షల టన్నుల బరువు వున్న వస్తువునో, స్పేస్ షిప్‌నో ముందుకు నెట్టడానికి FRBల శక్తిని ఉపయోగిస్తున్నారని ఓ అంచనా.

గ్రహాంతర వాసులు, ఏలియన్స్, FRB, NASA, ISRO, frb full form, radio wave, fast radio burst, frb canada, frb in space,
ప్రతీకాత్మక చిత్రం


మరో ప్రదేశం నుంచి కూడా FRBలు: ఇప్పటివరకూ ఒకవైపు నుంచి మాత్రమే వచ్చిన FRBలు తాజాగా మరోవైపు నుంచి కూడా రావడాన్ని కెనడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సైంటిస్టుల టీంలో భారత సంతతి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ రెండో ప్రాంతం మన భూమికి 150 కోట్ల కాంతి సంవత్సరాల అవతల ఉంది. ఇది మన పాల పుంతకు చాలా దూరంలో ఉంది. ఇంకా ఇలాంటివి ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే వాటి మూలాలేంటి? వాటిని గ్రహాంతరవాసులే సృష్టిస్తున్నారా? అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సైంటిస్టులు. ప్రస్తుతం బ్రిటిష్‌ కొలంబియాలోని ఒకాన్‌గాన్‌ లోయలోని చైమ్‌ టెలిస్కోపు FRBలను ఆన్వేషిస్తోంది. అన్ని ప్రశ్నలకూ త్వరలోనే సమాధానం దొరకాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి:


మార్స్‌పై బంగారం ఉందా? ఆ మెరుస్తున్నదేంటి?


అరుణ గ్రహాన్ని చేరగలమా? నాసా ముందున్న సవాళ్లేంటి?


మరో ప్రపంచం : భూమి లాంటి గ్రహాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు

First published:

Tags: Information Technology, ISRO, NASA, Technology

తదుపరి వార్తలు