MYSTERIOUS BLIND VILLAGE OF MEXICO IN THIS AREA EVERY HUMAN AND ANIMALS ARE BLIND HERE IS THE REASON BEHIND THIS SK
Blind Village: ఆ ఊళ్లో అందరూ అంధులే.. మనుషులే కాదు... జంతువులకు కూడా కళ్లు కనిపించవు.. కారణమేంటి?
ప్రతీకాత్మక చిత్రం
Blind Village: ఆ గ్రామంలో ఎవరికీ కళ్లు కనిపించవు. మనుషులే కాదు.. జంతువులు కూడా చూడలేవు. చుట్టూ వెలుగులు ఉన్నా.. కళ్లు లేకపోవడం వల్ల.. కటిక చీకట్లోనే బతుకుతున్నారు. మరి ఆ ఊరు ఎక్కడ ఉంది. దాని విశేషాలంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ భూ మండలంపై ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు మిగతా వాటి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కొందరు ప్రజల సంస్కతి సంప్రదాయాలు కూడా చాలా వింతగా చివిత్రంగా ఉంటాయి. మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉంటాయి. అందుకు కారణమేంటో.. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కదు. అలాంటి గ్రామం ఒకటి మెక్సికో (Mexico Blind Village) లో ఉంది. అక్కడ ఉండే ప్రజలంతా అంధులే. వారికి కళ్లు కనిపించవు. కేవలం మనుషులే కాదు. కోళ్లు, కుక్కలు, ఆవులు వంటి జంతువులు కూడా ఈ ప్రపంచాన్ని చూడలేవు. వినడానికి చాలా వింతగా ఉన్నా..ఇది నిజం. చూపు లేకుండానే అక్కడి ప్రజలు బతుకుతున్నారు. కలిసి మెలిసి జీవిస్తున్నారు.
మెక్సికోలోని టిల్టెపెక్ (Tiltepec)అనే గ్రామం ఉంది. అంధుల గ్రామంగా దీనికి పేరుంది. ఇక్కడ మనుషులతో పాటు జంతువులకు కూడా కళ్లు కనిపించవు. కేవలం అంధులు మాత్రమే నివసించే ఏకైక గ్రామం ఈ భూమ్మిద (Blind village) ఇదే అయి ఉండొచ్చు. టిల్టెపెక్ గ్రామంలో జాపోటక్ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ పుట్టే పిల్లలు.. బాగానే ఆరోగ్యంగా ఉంటారు. కళ్లు కూడా బాగానే ఉంటాయి. కానీ క్రమక్రమంగా కొద్ది రోజుల్లోనే వారి కంటి చూపు పోతుంది. జంతువుల పరిస్థితి కూడా ఇదే. పుట్టిన తర్వాత.. మెల్లమెల్లగా చూపు కోల్పోతూ.. అంధులవుతున్నారు. ఇలా ఆ ఊర్లో ఎవరికీ కళ్లు కనిపించవు. ఎవరు ఎలా ఉంటారో.. అస్సలు చూడలేరు. పూర్తి చీకట్లోనే బతికేస్తున్నారు.
ఈ గ్రామంలోని ప్రజలకు అంధత్వానికి కారణమేంటి? మనుషుల నుంచి జంతువుల వరకు అందరి కళ్లు కనిపించవు? ఈ ప్రశ్నలకు గ్రామస్తుల నుంచి ఆసక్తికర సమాధానం వస్తుంది. తమ ఊరిలో ఓ చెట్టు ఉందని.. దానివల్లే తామంతా అంధులుగా మారామని చెబుతున్నారు. అక్కడ చాలా ఏళ్లుగా ఆ చెట్టు ఉంది. అది శాపగ్రస్తమైదని.. ఆ కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందని నమ్ముతారు. ఆ చెట్టును చూడగానే గుడ్డి వారు అవుతారని అక్కడి ప్రజలు చెబుతుంటారు. కానీ ఇది మూఢనమ్మకని.. చెట్టును చూస్తే కళ్లుపోవడమేంటని మిగతా ప్రపంచం భావిస్తోంది.
కానీ శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయం మరోలా ఉంది. ఆ ప్రాంతంలో విషపూరితమైన ఓ ఈగ జాతి ఉందని. వాటి వల్లే అక్కడి వారు అంధులుగా మారుతున్నారని చెబుతున్నారు. ఆ ఈగలు కుడితే.. వారు అంధులవుతారని వెల్లడించారు. ఈ గ్రామంపై ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వారికి సాయం చేసేందుకు ప్రయత్నించింది. వేరొక ప్రాంతానికి తరలించాలని భావించింది. ఇతర ప్రాంతాల వాతావరణానికి వారి శరీరాలు సహకరించడం లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వారు అక్కడే ఉండాల్సి వస్తోంది. ఇక్కడి ప్రజలు ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒక పొడవాటి కర్రకు ఒక కొనన ఒకరు, మరో కొనక ఇంకొకరు పట్టుకొని ముందుకు వెళ్తుంటారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.