• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MYSTERIOUS 41 KG METAL BALL DISCOVERED ON BEACH IN BAHAMAS PHOTO GOES VIRAL SK

ఆకాశం నుంచి పడిన అంతుచిక్కని వస్తువు.. అసలేంటది? దానిపై ఉన్న రాతలకు అర్థమేంటి?

ఆకాశం నుంచి పడిన అంతుచిక్కని వస్తువు.. అసలేంటది? దానిపై ఉన్న రాతలకు అర్థమేంటి?

మెటల్ బాల్

మెటల్ బాల్‌పై ఉన్న రష్యన్ అక్షరాలకు అర్ధం ఏంటంటే.. -170 డిగ్రీల నుంచి -190 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద అది పనిచేస్తుంది. దాని సామర్థ్యం 43 లీటర్లు. దానిపై ఇంతే రాసి ఉంది. ఇక ఎలాంటి వివరాలు లేవు.

  • Share this:
    ఆకాశం.. సూర్యుడు.. చంద్రుడు.. నక్షత్రాలు.. తోక చక్కలు.. మనం పైకి చూస్తే కనిపించేవి ఇవే. కానీ ఈ అనంత విశ్వంలో మనకు తెలియని అంతుచిక్కని విషయాలు చాలా ఉన్నాయి. అందుకే విశ్వం రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషిచేస్తున్నారు. ఆకాశంలోకి రాకెట్లను పంపి ఇతర గ్రహాల గురించి తెలుసుకున్నారు. అందుకే ఆకాశమన్నా.. అంతరిక్షమన్నా.. అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ఐతే ఈ అనంత విశ్వానికి సంబంధించి కరీబియన్ దీవుల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆకాశం నుంచి ఓ భారీ వస్తువు ఒకటి కిందపడింది. బాహమాస్ తీరంలో ఇది లభ్యమైంది.

    అందమైన కరీబియన్ దీవుల్లో బాహమాస్ ఒక దేశం. బ్రిటన్‌కు చెందిన మనోన్ క్లార్క్‌కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ భూమిపై ఉన్న అందమైన ప్రదేశాల్లో తిరుగుతుంది. ఇటీవల బాహమాస్‌లో కూడా పర్యటించింది. ఫిబ్రవరి 24న హార్బర్ ఐలాండ్‌లోని బీచ్‌ల్లో విహరిస్తుండగా సముద్ర తీరంలో ఓ వింత వస్తువు కనిపించింది. అంతకు ముందు ఆమె అలాంటి వస్తువును ఎప్పుడూ చూడలేదు. అది చూడటానికి గుండ్రంగా ఉండి బంతిలా మెరుస్తోంది. కానీ చిన్నది కాది. దాని బరువు 41 కేజీలు ఉంది. ఆ లోహపు బంతిపై రష్యన్ భాషలో ఏదో రాసి ఉంది. ఆ వస్తువును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.


    ఆ మెటల్ బాల్‌పై ఉన్న రష్యన్ అక్షరాలకు అర్ధం ఏంటంటే.. -170 డిగ్రీల నుంచి -190 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద అది పనిచేస్తుంది. దాని సామర్థ్యం 43 లీటర్లు. దానిపై ఇంతే రాసి ఉంది. ఇక ఎలాంటి వివరాలు లేవు.


    సోషల్ మీడియాలో ఆ ఫొటోలు చూసిన కొందరు అంతరిక్ష నిపుణులు అది టైటానియం బాల్ అని చెబుతున్నారు. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి విడిపోయి కిందపడి ఉంటుందని భావిస్తున్నారు. దానిపై రష్యన్ భాషలో అక్షరాలు రాసి ఉండడంతో.. అది రష్యాకు చెందిన అంతరిక్ష వాహన నౌక నుంచి విడిపోయి.. బాహమాస్ తీరంలో పడిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికొందరమే ఉపగ్రహం నుంచి విడిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

    అది రాకెట్‌లో ఉండే హైడ్రజైన్ ప్రొపెల్లెంట్ ట్యాంక్ అని ప్రముఖ ఆస్ట్రోనాట్, వర్జిన్ గెలాక్టిక్ ఛైర్మన్ మార్క్ మొరబిటో చెప్పారు. 99 శాతం వరకు తాను చెప్పిందే కరెక్ట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ వస్తువు క్యూబాలో తయారై ఉండవచ్చని ల్యూడ్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సారా హడ్‌స్పిత్ తెలిపారు. ఎందుకంటే గతంలో క్యూబా దేశం సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేదని ఆయన తెలిపారు. మొత్తంగా ఈ వస్తువు గురించి ఇంటర్నెట్‌లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published: