నా వీకెండ్ మొదలైంది... ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్... పడి పడి నవ్వుతున్న నెటిజన్లు...

Viral Tweet : టిక్ టాక్ లాంటి యాప్స్ వచ్చిన తర్వాత... షార్ట్ వీడియో మెసేజ్‌లకు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. అలాంటి ఓ వీడియోని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 7:02 AM IST
నా వీకెండ్ మొదలైంది... ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్... పడి పడి నవ్వుతున్న నెటిజన్లు...
వైరల్ ట్వీట్ దృశ్యం (Image : Twitter - anand mahindra)
  • Share this:
పిల్లలకూ, పెద్దలకూ ఓ తేడా ఉంది. పిల్లలకు బాధ్యతలు ఉండవు. అందువల్ల వాళ్లు ఏం చేసినా ఈ ప్రపంచాన్ని మర్చిపోయి చెయ్యగలరు. అలాంటి ఓ పిల్లాడు... అమ్మ చెప్పిన సామాన్లు తేవడానికి బయటకు వెళ్లాడు. తిరిగి వస్తూ... తన టాలెంట్ చూపించాడు. ట్రాఫిక్‌లో వినిపించే రకరకాల సౌండ్లకు రకరకాలుగా డాన్స్ స్టెప్స్ వేసి... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా వీడియో చివర్లో వేసిన స్టెప్పులకు జనం నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆ వీడియోని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ మధ్య కాలంలో తాను చూసిన సంతోషకరమైన వీడియో ఇదే అన్నారు. తాను పడి పడి నవ్వుతున్నానన్న ఆయన... తన వీకెండ్ మొదలైపోయిందని అన్నారు. ఆ పిల్లాణ్ని మెచ్చుకున్నారు.


ఆగస్ట్ 9న పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌కి ఇప్పటికే 28వేల లైక్స్ వచ్చాయి. అలాగే 7వేల మంది రీ-ట్వీట్ చేశారు. ఇక కామెంట్ల తుఫాను కురుస్తోంది. ఎక్కువ మంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కొంత మంది మాత్రం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కుప్పకూలుతుంటే... ఏం చెయ్యాలో తెలియక ఇలాంటి వీడియోలు చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఏమైతేనేం... ట్వీట్ వీడియో మాత్రం వైరలై దుమ్మురేపుతోంది.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>