Meteor : ఆకాశంలో అద్భుత ఉల్క... చూసితీరాల్సిందే... వైరల్ వీడియో

వర్షాలు, ఉల్కలు ఎప్పుడుబడితే అప్పుడు రావు. అవి వచ్చినప్పుడే మనం వాటిని ఎంజాయ్ చెయ్యాలి. ఆ క్షణాలను మిస్సైతే... జీవితంలో చాలా కోల్పోయినట్లే.

news18-telugu
Updated: August 1, 2020, 1:14 PM IST
Meteor : ఆకాశంలో అద్భుత ఉల్క... చూసితీరాల్సిందే... వైరల్ వీడియో
Meteor : ఆకాశంలో అద్భుత ఉల్క... చూసితీరాల్సిందే... వైరల్ వీడియో (credit- twitter)
  • Share this:
ఆకాశం అద్భుతమైనది. మేఘాలు లేనప్పుడు రాత్రి వేళ ఆకాశాన్ని గమనిస్తే... నక్షత్రాలు, చందమామతోపాటూ... అదృష్టం ఉంటే... ఉల్కలు, తోకచుక్కలు కూడా కనిపిస్తాయి. గుర్తు పట్టగలిగితే... గ్రహాల్ని కూడా చూడొచ్చు. అంతెందుకు... ఇప్పుడు రోజూ రాత్రి వేళ ఆకాశంలో గురుగ్రహం, శనిగ్రహం, మార్స్, శుక్రగ్రహం రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని ఆసక్తిగా చూసేవాళ్లు ఎంత మంది. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా... ఇలాంటి ఎన్నో ప్రకృతి వింతల్ని మనిషి మిస్సవుతున్నాడు. తాజాగా మెక్సికోలోని... తావోస్‌లో ఉల్కాపాతం జరిగింది. అక్కడ ఆ సమయంలో... మ్యుజీషియన్ అంబెర్ కఫ్మాన్‌కి లక్కీగా ఓ ఉల్క కనిపించింది. అది ఆకాశంలో అలా వెళ్తుంటే... ఆశ్చర్యపోతూ... వీడియో తీశారు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటిది చూడలేదనీ, ఇదో అద్భుతమని చెబుతూ.. అంబెర్ ఆ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు.


సాధారణంగా ఉల్కలు ఇంత స్పష్టంగా కనిపించవు. ఈ వీడియోలో మాత్రం ఆ ఉల్క నిప్పులు చిమ్ముతూ... కాంతివంతంగా మెరిసిపోతూ... దూసుకెళ్లింది. జులై 29న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవ్వడం వింతేమీ కాదు. ఇప్పటికే 33 లక్షల మంది చూశారు. 2లక్షల మందికి పైగా లైక్ చేశారు. 47 వేల మంది కామెంట్లు రాశారు.


ఇది చాలా గొప్పవిషయం. మీకు థాంక్స్. కొన్ని కిలోమీటర్ల అవతల ఇలాంటిదే జరిగింది. మేం సౌండ్ మాత్రమే వినగలిగాం. మీరు దృశ్యాన్ని కూడా తీశారు. 2016లో కేరళలో ఇలా జరిగింది అని ఓ నెటిజన్ తన అభిప్రాయం తెలిపారు.


సాధారణంగా ఉల్కలు భూ వాతావరణంలోకి రాగానే కాలి బూడిదైపోతాయి. ఇది మాత్రం భూమి దగ్గర దాకా వచ్చేసి కాలుతోంది. అది ఎక్కడ పడిందో, అక్కడ ఏమైనా అయ్యిందేమో తెలుసుకున్నారా? అని మరో నెటిజన్ అడిగారు.

ఆ ఉల్క పర్వతాల వైపు వెళ్లిందనీ... అక్కడ నేషనల్ ఫారెస్ట్ ఉందన్న అంబెర్... అది ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం అన్నారు.
Published by: Krishna Kumar N
First published: August 1, 2020, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading