బీబీసీ లైవ్‌లో బుజ్జి పాప.. ‘యాంకర్ పేరేంటి మమ్మీ..’ అంటూ చెప్పే వరకు వదల్లేదు..

కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలుసుకునేందుకు ఈ వీడియో ఓ ఉదాహరణగా సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

news18-telugu
Updated: July 2, 2020, 8:14 PM IST
బీబీసీ లైవ్‌లో బుజ్జి పాప.. ‘యాంకర్ పేరేంటి మమ్మీ..’ అంటూ చెప్పే వరకు వదల్లేదు..
బీబీసీకి తల్లి ఇంటర్వ్యూ ఇస్తుండగా మధ్యలో వచ్చిన కుమార్తె
  • Share this:
ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కష్టాలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, వర్కింగ్ ఉమెన్స్‌కు ఎలాంటి కష్టాలు ఉంటాయో సరదాగా చెప్పే సీన్ ఇది. బీబీసీ ఇంటర్వ్యూలో ఈ సరదా సంఘటన జరిగింది. ఓ వైపు తల్లి బీబీసీకి ఇంటర్వ్యూ ఇస్తుంటే, మరోవైపు ఓ చిన్న పాప ఎంచక్కా బ్యాక్ గ్రౌండ్ సర్దుతూ సరదాగా గడిపింది. తన తల్లి ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవడానికి అత్యంత ఉత్సాహం చూపింది. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసిన యాంకర్ కూడా స్పందించడం విశేషం. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద క్రిస్టియన్ ఫ్రేజర్ అనే బీబీసీ యాంకర్ డాక్టర్ క్లేర్ వెన్హమ్ అనే మహిళతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. యాంకర్ టీవీ స్టూడియో నుంచి డాక్టర్ క్లేర్ తన ఇంటి నుంచి లైవ్ లో ఉన్నారు. వారిద్దరూ చర్చిస్తున్న సమయంలోనే ఈ చిన్న పాప సీన్ లోకి వచ్చింది. వచ్చీ రావడంతో ఆ తల్లికి కష్టాలు మొదలు. స్క్రీన్ మీద చిన్నారి కనిపించనివ్వకుండా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, ఆ బుడత వదిలిపెట్టలేదు. కాసేపు తల్లి కూర్చుని ఉన్న వెనుక వైపు అల్మారాలో ఫొటోలు సర్దింది. ఆ తర్వాత తన తల్లి ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దీంతో యాంకర్ ఎవరు? అతని పేరేంటి? అంటూ అడగసాగింది. ఓ వైపు తల్లి ఆ చిన్నారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు యాంకర్ కూడా దీన్ని గమనించాడు. ఆ చిన్నారి అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘మై నేమ్ ఈజ్ క్రిస్టియన్’ అని చెప్పాడు. అంతలో ఆ తల్లి కూడా నవ్వుతూ పాపను కిందకు దించేసింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలుసుకునేందుకు ఈ వీడియో ఓ ఉదాహరణగా సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ పాప పేరు స్కార్లెట్.
First published: July 2, 2020, 8:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading