హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: రైల్లో వెళ్తూ కుర్రాళ్ల రిస్కీ స్టంట్స్.. ట్రైన్ డోర్ల వద్ద నిల్చొని.. బయటకు వేళాడుతూ..

Viral Video: రైల్లో వెళ్తూ కుర్రాళ్ల రిస్కీ స్టంట్స్.. ట్రైన్ డోర్ల వద్ద నిల్చొని.. బయటకు వేళాడుతూ..

యువకుల రిస్కీ స్టంట్స్ (photo & Video courtesy: ANI)

యువకుల రిస్కీ స్టంట్స్ (photo & Video courtesy: ANI)

ఈ తరం కుర్రాళ్లు సోషల్ మీడియాకు బాగా అడిక్టయ్యారు. రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. చివరకు శవాలతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టుకుని వైరల్ చేస్తున్నారు. నెట్టింట లైకులు, షేర్లు, కామెంట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. తాజాగా..

ఇంకా చదవండి ...

ఈ తరం కుర్రాళ్లు సోషల్ మీడియాకు బాగా అడిక్టయ్యారు. నెట్టింట హీరోలుగా అవతారం ఎత్తడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఎలాంటి రిస్కీ ఫీట్ నయినా చేస్తున్నారు. కొండలు గుట్టలు ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు. జలజల పారే సెలయేరులో నడిమధ్యలోకి వెళ్లి మరీ ఫొటో క్లిక్స్ కోసం రిస్క్ తీసుకుంటున్నారు. బైక్ లపై రయ్యిమంటూ వెళ్తూ వెనకనుంచి మిత్రులతో వీడియోలు తీయించుకుంటున్నారు. రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. చివరకు శవాలతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టుకుని వైరల్ చేస్తున్నారు. నెట్టింట లైకులు, షేర్లు, కామెంట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ రిస్కీ స్టంట్స్ చేసిన వారిపై కేసును నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దాదాపు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఓ రైలు వేగంగా దూసుకెళ్తోంది. ఆ రైల్లోని కొందరు యువత వింత నిర్వాకానికి పాల్పడ్డారు. ఆ రైలు డోర్ల వద్ద నిల్చుని బయటకు వేళాడుతూ, రైలుపట్టాల పక్కన ఉండే ఎలక్ట్రిక్ పోల్స్ ను ముట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒక్కో ఎలక్ట్రిక్ పోల్ వచ్చినప్పుడల్లా బయటకు పూర్తిగా వేలాడుతూ దాన్ని టచ్ చేయడానికి రిస్క్ చేశారు. అదే సమయంలో ఈ రిస్కీ టాస్కును వీడియో కూడా తీసుకున్నారు. సోషల్ మీడియాలో పెట్టారు. రైల్లోని మిగిలిన ప్రయాణికులంతా వద్దనీ, ప్రాణాలకు ప్రమాదమని వారిస్తున్నా ఆ యువకులు వినలేదు.


ముంబైలో జరిగిందీ ఈ ఘటన. నెట్టింట వైరల్ అయిన ఆ వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ముంబై పోలీసులు సుమోటాగా కేసును నమోదు చేసుకున్నారు. ఆ యువతపై రైల్వే చట్టాలను అతిక్రమించినందుకుగానూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నామనీ, త్వరలోనే పట్టుకుంటామని ముంబై పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి స్టంట్స్ చేసి ప్రాణాలకు ముప్పును తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Crime news, Trending videos, VIRAL NEWS, Viral Videos

ఉత్తమ కథలు