హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

117 కేజీల బరువు నుంచి 75 కిలోలకు.. 10 నెలల్లోనే అద్భుతం.. భారీగా చెమటోడ్చకుండా.. ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా..

117 కేజీల బరువు నుంచి 75 కిలోలకు.. 10 నెలల్లోనే అద్భుతం.. భారీగా చెమటోడ్చకుండా.. ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 కిలోల బరువును కేవలం 10 నెలల్లోనే తగ్గి చూపించిందా మహిళ. ఒకప్పుడు ఆమె బరువు 117 కేజీలు. ప్రస్తుతం కేవలం 75 కిలోలు. భారీగా కష్టపడలేదు. చెమటోడ్చలేదు. కేవలం చిన్న చిన్న టిప్స్ తో..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 కిలోల బరువును కేవలం 10 నెలల్లోనే తగ్గి చూపించిందా మహిళ. ఒకప్పుడు ఆమె బరువు 117 కేజీలు. ప్రస్తుతం కేవలం 75 కిలోలు. భారీగా కష్టపడలేదు. చెమటోడ్చలేదు. కేవలం చిన్న చిన్న టిప్స్ తో..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 కిలోల బరువును కేవలం 10 నెలల్లోనే తగ్గి చూపించిందా మహిళ. ఒకప్పుడు ఆమె బరువు 117 కేజీలు. ప్రస్తుతం కేవలం 75 కిలోలు. భారీగా కష్టపడలేదు. చెమటోడ్చలేదు. కేవలం చిన్న చిన్న టిప్స్ తో..

  ఒకప్పుడు ఆమె బరువు 117 కేజీలు.. ఇప్పుడు ఆమె బరువు 75 కిలోలు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో ఏళ్లు గ్యాప్ ఉంటుందనుకుంటే పొరపాటే. కేవలం పదంటే పది నెలలు మాత్రమే తేడా. ఏంటీ నమ్మలేకపోతున్నారా? కేవలం పది నెలల్లోనే 42 కిలోల బరువును తగ్గి చూపించిందో మహిళ. రోజూ జిమ్ కు వెళ్లి, వర్కవుట్లు చేసి కష్టపడి ఒంట్లో కొవ్వును కరిగించిందనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టలేదు. కేవలం చిన్న చిన్న టిప్స్ ను పాటించి, చిన్న చిన్న వర్కవుట్లు మాత్రమే చేస్తూ ఈ అరుదైన ఫీట్ ను సాధించిందో మహిళ. మరి ఆ మహిళ అసలేం చేసిందో, ఎలా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందో ఓ లుక్కేయండి. ముంబై నగరంలో పుట్టి పెరిగి, దుబాయిలో ప్రస్తుతం నివసిస్తున్న జయా బెలాని అనే మహిళకు 38 ఏళ్ల వయసు. ఆమెకు పీసీఓస్ అనే ఒక ఆరోగ్య సమస్య ఉంది. దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కొంత కాలంగా ఆమె బరువు అమాంతం పెరిగింది.

  పది నెలల క్రితం ఆమె ఆరోగ్య పరమైన టెస్టులు చేయించుకున్నప్పుడు 117 కిలోల బరువు ఉన్నట్టు గ్రహించింది. ఆ రిపోర్టులను చూసి జయా బెలానికి భవిష్యత్ పై బెంగ పట్టుకుంది. ఇప్పుడే ఇంత బరువు ఉంటే భవిష్యత్తులో తన పరిస్థితి ఏంటని ఆందోళన చెందింది. అంతే బరువు తగ్గాల్సిందేనని నిర్ణయించేసుకుంది. కానీ ఏ లాభం. సరిగ్గా అప్పుడే లాక్ డౌన్ వచ్చి పడింది. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి. అంతటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని జయా నిర్లక్ష్యం చేయలేదు. ఇంట్లో ఉండే బరువు తగ్గలేమా? అని ఆలోచించింది. యూట్యూబ్ వీడియోలు చూసింది. వాటిల్లో చెప్పే చిన్న చిన్న టిప్స్, చిన్నపాటి వర్కవుట్లను సార్ట్ చేసింది. అదే సమయంలో ఆహారం విషయంలో కూడా ఓ పద్ధతి ప్రకారం ఫాలో అయింది. భోజనం చేయడానికి ముందు పండ్లు, సలాడ్ వంటివి తీసుకునేది. తద్వారా ఆహారం తక్కువగా తినేది.

  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

  గతంలో తీసుకునే ఆహారంలో మూడింట రెండొంతులకు తగ్గించేసింది. అదే సమయంలో భోజనాన్ని ఒకేసారి తినకుండా విడతల వారీగా కొంచెం కొంచెం తినడాన్ని మొదలు పెట్టింది. ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం తినేది. ఆ తర్వాత మిగిలిన భోజనాన్ని పక్కన పెట్టేసేది. మళ్లీ ఆకలి వేసిన తర్వాత మళ్లీ కొంచెంకొంచెంగా తినేది. ఇలా తన డైట్ ను ప్లాన్ చేసుకునేది. ఇంట్లో తన కుటుంబ సభ్యులకు వండి పెడుతూనే, తన కోసం కూడా ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేసుకునేది. కొలస్ట్రాల్ లేకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వయంగా చేసుకుని తినేది. తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలైన బ్రెడ్, బిస్కెట్లు, చాకోలెట్స్, ఆయిల్ ఫుడ్స్ ను కూడా బరువు తగ్గేందుకు పక్కన పెట్టేసింది. రోజూ పొద్దున్నే గోరు వెచ్చని నీళ్లల్లో కాస్త పసుపు, అల్లం, నిమ్మకాయ వంటి వాటిని బ్లాక్ టీలో కలిపి తాగడం మొదలు పెట్టింది.

  ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

  ‘కొంత మంది కొద్ది రోజులు ఈ తరహా డైట్, వర్కవుట్లను మొదలు పెట్టి బరువు తగ్గడం లేదు కదా అని మానేస్తుంటారు. అది సరైన పద్దతి కాదు. నేనయితే ఓపిగ్గా ఎదురు చూశా. నాలుగు నెలల తర్వాత కానీ నాలో మార్పులు కనిపించలేదు. క్రమక్రమంగా పది నెలల్లోనే 42 కిలోల బరువు తగ్గా. ప్రస్తుతం నా బరువు 75 కిలోలు. ఎంత డైట్ ఫాలో అయినా కొన్ని రకాల ఆహార పదార్థాలను చూస్తే నాకు నోరూరేది. అందుకే చికెన్ ఫ్రైడ్ పీస్ లను కొద్ది మొత్తంలో వారంలో ఒకసారి తీసుకునేదాన్ని. మామూలు చికెన్ ను మాత్రం బ్రెడ్, రైస్ లాంటివి ఏమీ కలపకుండా తీసుకునేదాన్ని. కొలస్ట్రాల్ శాతం ఉన్నప్పటికీ నాకు ఇష్టమైన వాటిని వారంలో ఒకసారి చాలా అతి తక్కువ పరిమాణంలో తినేదాన్ని. నాకు ఏడేళ్ల, పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిని చదివించుకుంటూనే రోజులో ఒక మూడు గంటలు నాకోసం కేటాయించుకున్నాను. కుటుంబం కోసం ఆహారం తయారు చేస్తూనే, నాకోసం కూడా ప్రత్యేకంగా ఆహారాన్ని రెడీ చేసుకున్నా. మొత్తానికి ఇంట్లోంచి కాలు బయటకు పెట్టుకుండా పది నెలల్లోనే 42 కిలోల బరువును తగ్గా‘ అంటూ జయా బెలాని తన సక్సెస్ సీక్రెట్ ను పంచుకుంటున్నారు.

  First published:

  Tags: Ayurveda health tips, Ayushman Bharat Health Scheme, Health benefits, Health benifits, Health food, Health Insurance

  ఉత్తమ కథలు