Home /News /trending /

MUMBAI WOMAN DONATES GOLD BISUIT TO BEGGER INSTEAD OF BREAD PVN

Gold : మహాతల్లివమ్మా నువ్వు : బ్రెడ్ అడిగిన బిక్షగాడికి బంగారపు బిస్కెట్ దానం చేసిన మహిళ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman donates gold bisuit to begger : బిచ్చగాళ్ళు ఇంటి ముందు నిలబడి..."కొంచెం బిక్షం వెయ్యండమ్మా,తినడానికి ఏదైనా ఉంటే పెట్టండమ్మా" అని అడుగుతుండటం కామన్. బిచ్చగాళ్లను ఖాళీ చేతులతో పంపడం చాలామందకి ఇష్టం ఉండదు. ఆకలితో అలమటించే భిక్షగాళ్లకు ఆహారం లేదా డబ్బు ఇవ్వడం ఇస్తుంటారు.

ఇంకా చదవండి ...
Woman donates gold bisuit to begger : బిచ్చగాళ్ళు ఇంటి ముందు నిలబడి..."కొంచెం బిక్షం వెయ్యండమ్మా,తినడానికి ఏదైనా ఉంటే పెట్టండమ్మా" అని అడుగుతుండటం కామన్. బిచ్చగాళ్లను(Beggers) ఖాళీ చేతులతో పంపడం చాలామందకి ఇష్టం ఉండదు. ఆకలితో అలమటించే భిక్షగాళ్లకు ఆహారం లేదా డబ్బు ఇవ్వడం ఇస్తుంటారు. అయితే ముంబై(Mumbai)లో ఉంటున్న సుందరి అనే మహిళ.. బెగ్గర్ కు ఏకంగా బంగారం(Gold) దానం చేసింది. . కూతురి పెళ్లి కోసం తన బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టేందుకు వెళ్లున్న సుందరికి దారిలో..పిల్లలతో కలిసి అడుకుంటున్న ఓ బిచ్చగాడు ఎదురయ్యాడు. తినడానికి ఏదైనా ఉంటే పెట్టండమ్మా అని సుందరిని భిక్షగాడు అడిగాడు.

దీంతో ఆ మహిళ తన బ్యాగ్‌లో ఉన్నగోల్డ్ బిస్కెట్ ని బ్రెడ్‌ అనుకొని పొరపాటుగా బిక్షకుడి ప్లేట్ లో దాన్ని వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన ప్లేట్ లో పడింది గోల్డ్ బిస్కెట్ అన్న సంగతి ఆ బిక్షకుడికి కూడా తెలియలేదు. ప్లేట్ లో బ్రెడ్ పడుతుందనుకుంటే ఏదో పడిందే..వాసన కూడా లేదు.. దీన్ని ఎలాగబ్బా తినేది అని అనుకొని ఆ బిచ్చగాడు ఆ గోల్డ్ బిస్కెట్ ని అక్కడే చెత్తకుండీలో విసిరేసి వెళ్లిపోయాడు.



Inspiring : 10వ తరగతి ఫలితాల్లో ఇరగదీసిన చైల్డ్ బెగ్గర్..అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరతాడంట

అయితే బంగారం తాకట్టు పెట్టేందుకు బ్యాంకుకు వెళ్లిన సుందరి.. తాను బిచ్చం వేసింది బ్రెడ్ కాదు గోల్డ్ అని తెలుసుకుంది. వెంటనే ఆమె తన కొడుకుతో కలిసి బిచ్చగాడు అడుక్కునే ప్రదేశానికి వచ్చింది. అయితే ఆ సమయంలో బిచ్చగాడు అక్కడ లేడు. భయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే సీసీ కెమెరా సహాయంతో భిక్షగాడిని గుర్తించిన పోలీసులు అతడిని విచారించారు. జూన్ 16, గురువారం, ముంబైలోని గోకులధామ్ కాలనీ సమీపంలోని చెత్త డంప్ సమీపంలో చెత్త కుండీలో రూ.5 లక్షల విలువైన 100 గ్రాముల బంగారాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దానిని పోలీసులు తిరిగి యజమానికి అప్పగించారు.

Lightning Strikes : అయ్యయ్యో..ఎంత దారుణం: పిడుగులు పడి 17మంది మృతి

మరోవైపు,ఇవాళ (20 జూన్ 2022, సోమవారం) బంగారం ధరలు స్థిరంగా పైపైనే కొనసాగుతుండగా, వెండి ధర మాత్రం వరుసగా రెండోరోజూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేటు 0.15 శాతం పెరిగి, ఒక ఔన్సు 1843 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా 0.41 శాతం పెరిగి, ఔన్సు 21.67 డాలర్లు పలుకుతోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gold, Mumbai

తదుపరి వార్తలు