Home /News /trending /

MUMBAI SWIGGY OFFERS REWARD FOR INFORMATION ON DELIVERY MAN ON HORSE PAH

భారీ వర్షంలో గుర్రం మీద ఫుడ్ డెలివరీ.. ఉద్యోగికి, అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన స్విగ్గీ సంస్థ..

గుర్రం మీద డెలివరీ చేస్తున్న ఉద్యోగి

గుర్రం మీద డెలివరీ చేస్తున్న ఉద్యోగి

Mumbai:  భారీ వర్షంలోను యువకుడు తన కస్టమర్ కు గుర్రం మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన యువకుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారిన విషయం తెలిసిందే. ఇతనికి ఉద్యోగం పట్ల ఉన్న నిబద్థతను సంస్థ గుర్తించింది.

సోషల్ మీడియాలో (social media) ప్రతిరోజు వేలల్లో వీడియోలు వైరల్ (viral video)  అవుతుంటాయి. దీనిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆసక్తికరంగాను ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే మనలో ఒక రకమైన స్పూర్తిని నింపుతుంటాయి. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు తమ స్పెషల్ ట్యాలెంట్ ను వీడియో రికార్డు చేసుకుని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. దీంతో వారి ట్యాలెంట్ వైరల్ కావడంతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించుకుంటున్నారు.

కొంత మంది గొప్ప పనులు చేస్తుంటారు. కానీ తగిన ప్లాట్ ఫామ్ లేకపోవడం వలన సరైన గుర్తింపు రాదు. అయితే.. వారి ట్యాలెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. ఇప్పటికే ఒక యువకుడు.. ఉద్యోగం చేస్తు.. ఆర్మీ ఉద్యోగానికి రోడ్డుమీద రన్నింగ్ చేసుకుంటు వెళ్లిన వీడియో గతంలో వైరల్ గా మారింది. ఇప్పుడు మరోక వీడియో ట్రెండింగ్ లో నిలిచింది. అయితే, ఇతను పనిని గుర్తించిన సంస్థ బాలుడికి అనుకొని సర్ ప్రైజ్ ఇచ్చింది.





పూర్తి వివరాలు.. గత వారం ముంబైలో (Mumbai Hervy rains)  భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో.. ఒక స్విగ్గీ డెలివరీ (Swiggy delivery boy)  బాయ్ తన కస్టమర్ కు భారీవర్షంలోను గుర్రం (Horse food delivery) మీద వెళ్లి ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. అప్పట్లో అతను వెనుకాల కారులో ఉన్నవ్యక్తి వీడియో తీసి దీన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది. అయితే, తాజాగా, ఈ ఘటనపై సంస్థ తమ ఉద్యోగికి, జాబ్ పట్ల ఉన్న అంకిత భావానికి ఎంతో సంతోషించింది. అతడిని ప్రత్యేకంగా ప్రశంసించింది. అంతే కాకుండా అతని సేవలకు ప్రొత్సహిస్తు.. ఐదువేల రూపాయలను (Reward ) నజరానాగా ప్రకటించింది. దీంతో మరోసారి ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Heavy Rains, Mumbai, Swiggy, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు