Home /News /trending /

MUMBAI SPINE CHILLING VIDEO TEENAGER FALLS OFF LOCAL TRAIN ESCAPES DEATH BY INCHES VIDEO GOES VIRAL PAH

లోకల్ ట్రైన్ లో షాకింగ్ ఘటన.. స్తంభాన్ని ఢీకొని కుప్పకూలిన టీనేజర్.. వీడియో వైరల్..

పొల్ ఢీకొని పడిపోయిన టీనేజర్

పొల్ ఢీకొని పడిపోయిన టీనేజర్

Mumbai local train: లోకల్ ట్రైన్ లో ఒక యువకుడు రైలు బయట వైపు వేలాడుతు ప్రయాణిస్తున్నాడు. అతను ట్రైన్ లోని పోల్ ను పట్టుకున్నాడు. అప్పుడు ఊహించని ఘటన జరిగింది.

కొంత మంది యువకులు తరచుగా రైళ్లలో (Trains)  ప్రమాదకరంగా జర్నీలు చేస్తుంటారు. ఇష్టమోచ్చిన ఫీట్లు వేస్తుంటారు. ట్రైన్ మెట్లమీద రాడ్ పట్టుకుని వేలాడుతుంటారు. మెట్ల మీద కూర్చుని వచ్చిపోయే వారికి ఇబ్బందిని కల్గ చేస్తుంటారు. మరికొంత మంది రన్నింగ్ రైలు (Local trains) మీద ఎక్కి.. దిగుతూ నానా ఫీట్లు వేస్తుంటారు. తమ చేతితో పోల్ లను తాకుతూ.. ప్లాట్ ఫామ్ మీద దూకుతూ తిరిగి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే తిరిగి రైలులో ఎక్కేస్తారు. యువకులు ఇలాంటి పిచ్చిచేష్టల (feets) అనేక వీడియోలు గతంలో వైరల్ (Viral video)  అయ్యాయి. కొన్ని సార్లు.... యువకులు ప్రమాదం నుంచి టైమ్ బాగుండి బయటపడ్డారు. మరికొన్ని సార్లు.. ప్రమాదంలో అదే రైలు కింద పడిపోయిన అనేక సంఘటనలు జరిగాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబై లోకల్ ట్రైన్ (Mumbai local train)  లో కొంత మంది ప్రయాణికులు.. రైలులో రద్దీ ఉండటం వలన బయటవైపు వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కల్వా, థానే స్టేషన్ ల మధ్య రైలు ప్రయాణిస్తుంది. ఇంతలో.. ఒక యువకుడికి స్తంభం బలంగా తాకింది. దీంతో అతను కుప్పకూలిపడిపోయాడు. కాగా, కింద పడిన వ్యక్తి.. కాల్వ ప్రాంతంలోని భాస్కర్ నగర్ కు చెందిన డానిష్ హుస్సేన్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు.


ఈ ఘటన గురువారం జరిగింది. వెంటనే అతడిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాల్వా వద్ద సమీపంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రికి తరలించినట్లు జీఆర్పి పోలీసులు తెలిపారు. అతడికి కాలు, చేతికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media)  వైరల్ గా (viral video) మారింది.

ఇదిలా ఉండగా ఒక యువతి లోకల్  ట్రైన్ లోనే కింద పడిపోతూ.. కొద్దిలో తప్పించుకుంది.



ఒక యువతి అజాగ్రత్త కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వైరల్ వీడియోలో ఓ యువతి..కదులుతున్న రైలులోని డోర్ అంచున నిలబడి ఉంది. మొదట తన దుస్తులు సరిచేసుకుంటూ కనిపించిన ఆ యువతి...తర్వాత తన జుట్టును సరిచేసుకుంటూ, రైలు నుండి సగం శరీరాన్ని బయటకు పెట్టి గాలి పీల్చుకోవాలని అనుకుంది. అయితే ఇదే ఆమెకు సమస్యగా మారింది.

అయితే అదే ట్రాక్‌పై నుంచి రైలు వస్తన్న విషయాన్ని యువతి తెలియదు. దీంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి రైలు కింద పడింది. వెంటనే యువతి వెనుక నిలబడిన ప్రయాణికులే ఆమెకు దూతలా మారారు. ఈ ప్రయాణికులు సకాలంలో యువతి చేయి పట్టుకున్నారు. చాలా సేపటికి ఆ యువతి రైలుకు వేలాడుతూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు బాలిక చేయి గట్టిగా పట్టుకున్నారు. అనంతరం బాలికను పైకి లాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రమాదకరమైన ఈ వీడియోను చూసిన వారంతా డోర్‌ దగ్గర నిలబడి ప్రమాదాల గురించి మాట్లాడుకోవడం కనిపించింది ముంబై లోకల్ ట్రైన్ లో ఇది జరిగినట్లుగా తెలుస్తోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Mumbai, Train, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు