రెజ్లింగ్ రింగ్‌లో ఎంతో మంది ప్రత్యర్థులను చిత్తు చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ది గ్రేట్ ఖలీకి ఎంత పాపులారిటీ ఉందో చెప్పక్కర్లేదు. ఈ రెజ్లింగ్ బాహుబలి అంటే ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టం. అలాంటి గ్రేట్ ఖలీ.. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చాడు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తూ నిత్యం క్రియేటివ్‌గా వీడియోలు చేసే ముంబై పోలీసులు మరోసారి అదే సూత్రాన్ని పాటించారు. గ్రేట్ ఖలీ సాయంతో హెల్మెట్ వాడకంపై అవేర్‌నెస్ తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
ద్విచక్ర వాహనాలైన స్కూటర్లు, బైక్‌లపై ప్రయాణం చేసేటప్పుడు సరైన హెల్మెట్‌ను ధరించడం ముఖ్యమని తెలియజేసేలా ఈ వీడియో ఉంది. బైక్ రైడ్‌కు వెళ్లాలనుకొని ఖలీ ఓ హెల్మెట్‌ను చేతుల్లోకి తీసుకోగా.. అతడి తల భారీగా ఉండడంతో అది పట్టదు. ఎన్నోసార్లు ప్రయత్నించినా సాధ్యం కాదు. దీంతో ఖలీ రైడ్‌ను క్యాన్సిల్ చేసుకుంటాడనేలా వీడియోలో ఉంది. “సరైన హెల్మెట్ లేకుంటే.. రైడ్ ఖాళీయే అని ది గ్రేట్ ఖలీకి తెలుసు. హెల్మెట్ లేకుండా రైడ్ ఎక్కువ దూరం సాగదని తెలుసు” అంటూ ముంబై పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు
హెల్మెట్ పెట్టుకునేందుకు ఇబ్బందులు పడిన ఖలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించడమే కాకుండా.. తమకు సరిపోయే సైజుల్లో ఉన్న వాటిని ధరించాలని సూచిస్తూ ఈ వీడియోను ముంబై పోలీసులు రూపొందించారు. “ఒకవేళ సరైన హెల్మెట్ ధరించకపోతే.. ఇంట్లో మాత్రమే తిరగగలరు” అనే క్యాప్షన్‌ను కూడా యాడ్ చేశారు.
ముంబై పోలీసులకు ఆలోచనను చాలా మంది నెటిజన్లు ప్రశంసించారు. ప్రజలకు అర్థమయ్యేలా క్రియేటివ్‌గా ట్రాఫిక్ నిబంధనలు బోధిస్తున్నారంటూ ఎంతో మంది కామెంట్లు చేశారు. పోస్ట్ చేసిన గంటల్లోనే ఈ ది గ్రేట్ ఖలీ వీడియోకు దాదాపు 50వేల వ్యూస్ రాగా.. లైక్‌లు వెల్లువలా వస్తున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తూ.. హెచ్చరిస్తూ ముంబై పోలీసులు ఎంతో సృజనాత్మకంగా సందేశాలు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సినిమా డైలాగ్‌లతో మీమ్లను సృష్టిస్తూ యూత్‌కు నిబంధనలు చేరువయ్యేలా.. కొన్నిసార్లు స్వీట్వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్న కొందరి ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభినందిస్తున్నారు. మొత్తంగా ట్రాఫిక్ నిబంధనలను ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కరోనా నిబంధనలు పాటించడంపైనా, వ్యాక్సినేషన్‌పైనా సోషల్ మీడియాలో ముంబై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mumbai Police, TRAFFIC AWARENESS