MUMBAI POLICE SHARES FUNNY VIRAL VIDEO OF 2 UNCLES FIGHTING IN BUS FOR SPACE AS ROAD SAFETY MESSAGE PAH
ఇదెక్కడి రచ్చ రా నాయన.. సిటీ బస్సులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైటింగ్ .. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో..
బస్సులో వాగ్వాదం చేసుకుంటున్న వృద్ధులు
Mumbai: ఇద్దరు వృద్ధులు సిటీ బస్సు ఎక్కారు. ఒకటే సీట్లో పక్క పక్కన కూర్చున్నారు. అయితే, ఇంతలో ఒకరితో మరోకరు వాగ్వాదానికి దిగారు. బస్ లో జనాలను ఏమాత్రం లెక్కచేయడం లేదు.
మనం సాధారణంగా బస్సులో ప్రయాణిస్తుంటాం. కొన్ని సార్లు.. బస్సులు రష్ గా ఉంటే, సీటుకోసం పడరాని పట్లు పడుతుంటాం. కిటీకి నుంచి సీటులో కడ్చీప్ వేయడం, బ్యాగ్ లు వేయడం, బైట నుంచి జాగ ఆపమని చెబుతుంటాం. మరికొందరు.. బస్సులో నుంచి ప్రయాణికులు దిగక ముందే.. కిటీకి నుంచి లోపలికి దూరిపోతుంటారు. సీటు కోసం నానా అవస్థలు పడుతుంటారు. అయితే, పొరపాటున, కడ్చీఫ్ వేసిన సీటులో ఎవరైన కూర్చుంటే.. వాటి పని అయిపోయినట్లే. కొంత మంది వారిని నోటికొచ్చినట్లు తిడతారు. గొడవలు చేయడానికి సైతం వెనుకాడరు. ఇలాంటి సన్నివేశాలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుంతం నెట్టింట (Social media) హల్ చల్ చేస్తుంది.
పూర్తి వివరాలు.. ముంబైలోని (Mumbai) లోకల్ బస్సులో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వృద్ధులు కలిసి బస్సు ఎక్కారు. ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. జాగ కోసం పొట్లాడటం మొదలేట్టారు. చివరకు ఇది వాగ్వాదం చేసుకుని కొట్టుకొవడం వరకు వెళ్లింది. ఇద్దరిట్లో ఏ ఒక్కరు కూడా తగ్గట్లేదు. కొంత మందికి చాదస్తం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇద్దరు కూడా.. నువ్వు జరుగు అంటే.. కాదు..కాదు.. నువ్వే జరుగు అంటూ రచ్చ చేసుకుంటున్నారు.
ఇద్దరు వృద్ధులు కలిసి బస్సు సీటుపై కూర్చుని స్థలం కోసం పోరాడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. "హాయ్ జగహ్," ఒక వ్యక్తి అంటున్నాడు. "నహీ హై," అవతలి వ్యక్తి కోపంతో సమాధానం చెబుతున్నాడు. స్థలం కోసం పోరాడుతున్నప్పుడు ఇద్దరూ కోపంగా అదే మాటలను పదేపదే రిపిట్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ను బస్సులో వెనుక వైపు కూర్చున్న కొందరు వీడియో తీసి (Video viral) నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. అది వైరల్ గా (trending video) మారింది. దీన్ని ముంబై పోలీసులు కూడా తమ అధికారిక ట్విటర్ అకౌంట్ లో దీన్ని పంచుకున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.