Home /News /trending /

MUMBAI POLICE SENDS CAKE TO RESPONSIBLE TWITTER USER FOR REFUSING TO MEET HER FRIENDS ON BIRTHDAY SU

ఇంటికే కేక్ పంపి.. ట్విట్టర్‌ యూజర్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన పోలీసులు.. అసలు ఎందుకలా చేశారంటే..

( Image credit: Twitter)

( Image credit: Twitter)

ముంబై పోలీసులు ఓ ట్విట్టర్ యూజర్‌కు అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు. నేరుగా ఇంటికే బర్త్ కేక్ పంపించారు.

    దేశంలో కరోనా సేకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజా భారీగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కరోనా కట్టడి కోసం పలు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ ఆంక్షలను అమలు చేయడానికి, ముంబై వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు రాత్రిపగలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక, అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలను గుర్తించేందుకు స్టిక్కర్స్ అంటించాలని నిర్ణయించింది. ఆయా వాహనాలు అందిస్తున్న సర్వీసులను బట్టి రెడ్​, గ్రీన్​, ఎల్లో వంటి మూడు కలర్​ స్టిక్కర్లను ఉపయోగిస్తున్నారు.

    ఈ క్రమంలోనే గురువారం పలువురు ట్విట్టర్ యూజర్స్ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫ్రెండ్స్‌ను కలవడానికి బయటకు వెళ్లాలంటే ఏ కలర్ స్టిక్కర్స్ యూజ్ చేయాలని అడిగారు. ఇదిలా ఉంటే @samsays అనే ట్విట్టర్ యూజర్‌ను బర్త్ డే పార్టీ చేసుకోవడానికి బయటకు రావాల్సిందిగా ఫ్రెండ్స్ కోరారు. అందుకు ఆమె నిరాకరించింది. నిబంధనలు పాటించాలని.. ఇలాంటి సమయాల్లో పార్టీలు చేసుకోవడం మంచింది కాదని చెప్పారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ స్క్రీన్ షాట్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫ్రెండ్స్ తనను బర్త్‌డే పార్టీ కోసం బయటకు రావాల్సిందిగా కోరుతున్నారని.. కానీ నేను వారికి ఈ విధమైన రిప్లై ఇచ్చానని పేర్కొన్నారు.





    ఆ చాటింగ్‌‌ను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. కరోనా వేళ ఎంత బాధ్యతగా వ్యవహరించిందో అంటూ ఆ నెటిజన్‌పై ప్రశంసలు కురిపించారు. పర్సనల్‌గా ఆ ట్విట్టర్ యూజర్‌కు మెసేజ్ చేసి అడ్రస్ తెలుసుకున్నారు. అనంతరం నేరుగా ఆ ట్విట్టర్ యూజర్ ఇంటికే కేక్ పంపి సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ‘రెస్పాన్సిబుల్ సిటిజెన్’ అని రాసి ఉన్న చాక్లెట్ కేకును అందజేశారు. దీంతో ఆ ట్విట్టర్ యూజర్ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తాను పోలీసుల ఇటువంటి కానుకను ఊహించలేదని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Birthday cake, Coronavirus, Mumbai, Mumbai Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు