Home /News /trending /

MUMBAI POLICE IS TAKING ON CORONA WITH 2020 VISION ADVISORY AND THE INTERNET IS IMPRESSED NS GH

Mumbai Police: ముంబై పోలీసుల 'ముందుచూపు' అదుర్స్.. వైరల్ గా విజన్ 2020

ముంబై పోలీసులు సోషల్ మీడియాలో ఉంచిన పోస్టు

ముంబై పోలీసులు సోషల్ మీడియాలో ఉంచిన పోస్టు

ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు ముంబై పోలీసులు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ లో వీరు అత్యంత చురుగ్గా ఉంటారు. తాజాగా ముంబై పోలీసులు పోస్ట్ చేసిన 'ఫోర్ సైట్ 2020' (foresight 2020)ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. 

ఇంకా చదవండి ...
ముంబై మహానగర పోలీసు శాఖ (Mumbai City police) ఇంటర్నెట్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నగరానికి సంబంధించిన ఎటువంటి ముఖ్యమైన సమాచారాన్ని అయినా ప్రజలకు ఎప్పటికప్పుడు అందించేందుకు వీరు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ లో ముంబై పోలీసులు అత్యంత చురుగ్గా ఉంటున్నారు. తాజాగా వీరు పోస్ట్ చేసిన 'ఫోర్ సైట్ 2020' (foresight 2020)ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. మనం కంటివైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మన కంటిచూపును పరీక్షించేందుకు ఉపయోగించే చార్టులాంటిదే ముంబై పోలీసులు కూడా రూపొందించారు. కానీ కాస్త పరిశీలనగా చూస్తే అందులో ఆసక్తికరమైన అంశాలు, విషయాలు మనల్ని ఆకట్టుకుంటాయి. 2020 సంవత్సరం చాలా సంక్షోభాలను తెచ్చిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారంటూనే రానున్న 2021 సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లలో కోవిడ్ పై అవగాహన పెంచుతున్నారు. 2021లో మన ప్రయాణం హాయిగా ఉండాలని, కరోనా పీడ విరగడ కావాలనే అర్థం వచ్చేలా వీరు చేసిన పోస్ట్ ను పరిశీలనగా మీరు కూడా ఒక్కసారి చూడండి.

అక్షరాలు మాత్రమే కావు..
ముంబై పోలీసుల లోగోతో 'ద 2020 విజన్' (vision 2020) అంటూ కొన్ని ఇంగ్లీష్ అక్షరాలను క్రమబద్ధంగా, లావుగా, ఆరోహణ క్రమంలో పొందుపరిచారు. ఇవి కేవలం అక్షరాలని పొరబడకండి. పబ్లిక్ సేఫ్టీ గురించిన విషయాల వివరణ ఇందులో దాగుంది. కోవిడ్ నుంచి రక్షణ పొందాలంటే ఇవన్నీ పాటించాలన్నది సారాంశం.

రక్షా మంత్రం
ఈ అక్షరాలన్నింటినీ కలిపి చదివితే మాస్క్, హ్యాండ్, హైజీన్, సిక్స్ ఫీట్ అపార్ట్ అని ఉంటుంది. ఈ అంశాలను పాటిస్తే ఇదే కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునే రక్షామంత్రమంటూ (Raksha mantra) ముంబై పోలీసులు సింపుల్ గా చెబుతున్నారు. ఎప్పుడూ మాస్కు ధరించే ఉండండి, వ్యక్తిగత శుభ్రత పాటించండి, భౌతిక దూరం పాటించండి, కనీసం ఆరడుగుల దూరం పాటిస్తే కోవిడ్-19 ముప్పు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని ముంబై పోలీసులు హితోపదేశం చేస్తున్నారు. ఇవన్నీ తూ.చా. పాటిస్తే కొత్త సంవత్సరంలోకి ఆరోగ్యంగా, హుషారుగా అడుగుపెడుతూ, భవిష్యత్తులో చక్కని ప్రయాణం చేయవచ్చనేది వీరు చెబుతున్న నీతి.
View this post on Instagram

Foresight is 2020! Practice guidelines so that the ride to 2021 is smoother. #2020Vision #TakingOnCorona


A post shared by Mumbai Police (@mumbaipolice) on


పోలీసుల క్రేజీ పోస్టులు
ముంబై పోలీసుల సోషల్ మీడియా (Mumbai city police social media accounts) అకౌంట్లలో చాలా క్రేజీ పోస్టులు (crazy posts) ఆసక్తిగొలిపేలా ఉంటాయి. ట్విట్టర్ (twitter), ఇన్ స్టాగ్రాంలో (instagram) ముంబై సిటీ పోలీసుల అకౌంట్లను నిత్యం లక్షలాది మంది నెటిజన్స్ ఫాలో అవుతారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు ఈ పోస్టులకు చాలా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇలాంటి పోస్టులను అభిమానులు షేర్, లైక్ చేసి, రీట్వీట్ చేసి, వైరల్ చేస్తుంటారు. ఇక ముంబై పోలీసుల మీమ్స్ (police memes)అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. క్రియేటివిటీ జోడించిన ఈ పోస్టుల్లో పజిల్స్, కార్టూన్లు, పాపులర్ సినిమా డైలాగులు, సంచలనం సృష్టించిన సంఘటనలు ఇలా ఒకటేమిటి నెటిజన్లకు చేరువయ్యేందుకు ఉపయోగపడే అన్ని సబ్జెక్టులను ముంబై పోలీసులు సరికొత్తగా ప్రయోగిస్తున్నారు.

దీంతో గత కొంతకాలంగా ముంబై పోలీసుల సోషల్ మీడియా పోస్ట్ అంటే అందరికీ ఆసక్తిగొలిపేదిగా మారింది. మనదేశంలోని ఇతర రాష్ట్ర పోలీసులు కూడా ఇప్పుడు ముంబై పోలీసు శాఖ అడుగుజాడలనే అనుసరిస్తూ సోషల్ మీడియాలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా సమయంలో ముంబై పోలీసులు చేసిన సోషల్ మీడియా పోస్టులు శరవేగంగా మహానగరంలోని ప్రజలకు చేరాయి. వరదలు, ట్రాఫిక్ జాం వంటి సమయాల్లోనూ ఈ పోస్టులు అన్ని వర్గాలవారికి ఉపయోగకరంగా ఉంటున్నాయి. 'క్రాక్ ద కోడ్' అంటూ గత నెలలో వీరు చేసిన మరో పోస్టు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువ లైకులు పొందింది. పజిల్స్ ను క్రాక్ చేస్తే వచ్చే మజా ఎవరికైనా ఎక్కువ ఆనందాన్ని పంచుతుంది కదా.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Maharashtra, Mumbai Police, Social distance, Social Media

తదుపరి వార్తలు