• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • MUMBAI POLICE HELPED AND SLAPS A 60 YEAR OLD MAN WHO GOT STUCK AT A RAILWAY TRACK HSN

Mumbai Railway Station: దూసుకొచ్చిన రైలు.. పట్టాల్లో ఇరుక్కున్న వ్యక్తి.. ఓ పోలీస్ కాపాడిన తర్వాతే హైలెట్ సీన్..

వృద్ధుడిని కాపాడిన పోలీస్

ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ లో షాకింగ్ సంఘటన జరిగింది. ఒక్క క్షణం ఆలస్యమయితే రైలు చక్రాల మధ్య ఓ వ్యక్తి నలిగిపోయేవాడు. ఓ పోలీస్ సహాయ పడటం వల్ల అదృష్ట వశాత్తూ బయటపడ్డాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

  • Share this:
    ప్రయాణికులకు ముఖ్య గమనిక. రైలు పట్టాలను దాటడం క్షేమం కాదు. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు.‘ అని రైల్వే స్టేషన్లలో ఎప్పుడూ ఓ ప్రకటనను అనౌన్స్ చేస్తూనే ఉంటారు. కానీ మనోళ్లు అస్సలు పట్టించుకోరు కదా. అంత దూరం వెళ్లి మెట్లు ఎక్కి వెళ్లాలంటే చాలా బద్దకం. అందుకే షార్ట్ కట్ లో ఒక్క నిమిషంలో రైలు పట్టాలను దాటేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు అవే వారికి ఇక్కట్లను కొని తెస్తుంటాయి. క్షణికకాలంలోనే మరణానికి దగ్గర చేస్తుంటాయి. ముంబైలోని ఓ రైల్వే స్టేషన్ లో అచ్చం అలాంటి సంఘటనే జరిగింది. ఒక్క క్షణం ఆలస్యమయితే రైలు చక్రాల మధ్య అతడు నలిగిపోయేవాడు. అదృష్ట వశాత్తూ బయటపడ్డాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..

    అది మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దహిసార్ రైల్వే స్టేషన్. ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఒక ఫ్లాట్ ఫాం నుంచి మరో ఫ్లాట్ ఫాం పైకి వెళ్లాలని అనుకున్నాడు. వయసు ప్రభావమో మరేమో కానీ మెట్లు ఎక్కేందుకు అతడు మొగ్గుచూపలేదు. రైల్వే ట్రాక్ ను దాటేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలోనే అతడి చెప్పు పట్టాలపై ఊడిపోయింది. దాన్ని వంగి తీసుకున్న అతడు అప్పుడే ప్లాట్ ఫాంపైకి ఎక్కి ఉంటే సరిపోయేది. పెను ప్రమాదం ముందుగానే తప్పేది. కానీ అతడు ఆపని చేయలేదు.. రైలు పట్టాల పక్కకు వెళ్లి తీరిగ్గా ఆ చెప్పును వేసుకుని మళ్లీ పట్టాలను దాటి ప్లాట్ ఫాం ఎక్కేందుకు యత్నించాడు.



    సరిగ్గా అదే సమయంలో ఓ రైలు పట్టాలపైకి దూసుకొచ్చింది. అతడి చర్యను గమనిస్తూ త్వరగా రా.. త్వరగా రా.. అంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ కేకలు పెడుతున్నాడు. సరిగ్గా రైలు పట్టాలపైకి రావడం, రైలుకు ప్లాట్ ఫాం మధ్యలోకి ఆ వ్యక్తి చేరుకోవడం క్షణ కాలంలోనే జరిగిపోయాయి. ఆ కానిస్టేబుల్ కూడా చాకచక్యంగా వ్యవహరించి అతడిని ప్లాట్ ఫాం పైకి లాగేశాడు. ఒక్క ఉదుటున ఇద్దరూ ఆ ప్లాట్ ఫాంపై పడిపోయారు. ఒక్క సెకను ఆలస్యమయితే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. అతడి చర్యలకు ఆ పోలీస్ కానిస్టేబుల్ కు చిర్రెత్తుకొచ్చిందనుకుంట. ప్లాట్ ఫాంపై ఇద్దరూ కింద పడిన వెంటనే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆ వ్యక్తి తలపై రెండు పీకాడు. అంత అజాగ్రత్త దేనికి..? ప్రాణాలు పోయేవే.? అంటూ క్లాస్ పీకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
    Published by:Hasaan Kandula
    First published: