Home /News /trending /

MUMBAI NSDL OFFICIAL ASKED FOR WATER MID SPEECH ENTER NIRMALA SITHARAMAN VIDEO GOES VIRAL PAH

Viral video: శభాష్ నిర్మలా జీ.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే..

వేదిక మీద చేరుకున్న నిర్మల సీతారామన్

వేదిక మీద చేరుకున్న నిర్మల సీతారామన్

Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కొంత మంది ఎంత ఉన్నత స్థానంలో ఉన్న ఒదిగే ఉంటారు. ఇలాంటివారు పదవీ, హోదాలను ఏమాత్రం పట్టించుకోరు. అందరితో ఇట్టే కలిసిపోతారు. వీరు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండి చాలా సింపుల్ గా ఉంటారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. వీరు పబ్లిక్ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీనితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయని భావిస్తారు. ఇలాంటి వారు అక్కడక్కడ మాత్రమే ఉంటారు. ఈ కోవకు చెందిన వారిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను భావించవచ్చు. ప్రస్తుతం ఆమె చేసిన పని నెట్టింట (Social media)  తెగ వైరల్ గా మారింది.





పూర్తి వివరాలు.. ముంబైలో(Mumbai)  గత శనివారం ఎన్ఎస్ డీఎల్ర (NSDL) జతోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్య క్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రత్యేక అతిథిగా (Nirmala sitharaman) హజరయ్యారు. అప్పుడు వేదిక మీద.. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజ చుండూరు (Padmaja Chunduru)  మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆమె తాగడానికి నీళ్ల కోసం అక్కడి వారికి సైగ చేశారు. తాను.. ఎంత సైగ చేసిన ఎవరు ఆమెను చూడలేదు. ఇదంతా అక్కడే ఉన్న నిర్మల సీతారామన్ గమనించారు. వెంటనే తన దగ్గర ఉన్న బాటిల్ (Water bottle)  ను తీసుకొని వేదిక మీద నడుచుకుంటు వెళ్లి పద్మజ చుండురుకి ఇచ్చారు.

దీంతో ఆడియన్స్ అంతా నిర్మల చేసిన పనికి చప్పట్లతో అభినందించారు. కాగా, ఎన్ ఎస్ డీఎల్ హిందీ, ఇతర ప్రాంతీయ భాషలో విద్యార్థుల కోసం పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమం ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ గా (viral video)  మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. శభాష్ నిర్మలాజీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Mumbai, Nirmala sitharaman, Viral Video

తదుపరి వార్తలు