కొందరు ప్రతి చిన్నవిషయానికి కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. ప్రేమించిన అమ్మాయి రిజక్ట్ చేసిందని, జాబ్ రాలేదని సూసైడ్ లు చేసుకుంటారు. మరికొందరు ఎగ్జామ్ లో పాస్ కాలేదని, ఇంట్లోవారు మొబైల్ ఫోన్ కొనివ్వలేదని కూడా ఆత్మహత్యలు చేసుకునే వారున్నారు. అంతే కాకుండా.. మరికొన్ని చోట్ల.. భార్య..కావాల్సిన పదార్థాలు వండలేదని, తాగడం మానేయమందని కూడా గొడవలకు దిగుతుంటారు. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచుగా వార్తలలో చూస్తునే ఉంటాం. ఇప్పటికే అమ్మాయిలు వివిధ కారణాలతో మనస్తాపానికి గురై సూసైడ్ లు చేసుకున్నారు. తాజాగా, మరో ఘటనలో.. యువతి సూసైడ్ కు ప్రయత్నించింది.
పూర్తి వివరాలు.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైకుల్లా స్టేషన్ పరిధిలో.. ఒక యువతి రైల్వే ప్లాట్ ఫామ్ మీద నిల్చోంది. ఆమె దూరం నుంచి లోకల్ ట్రైన్ రావడాన్ని గమనించింది. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి రైలుకు ఎదురుగా వెళ్లి నిలబడింది. ఆమెను ప్లాట్ ఫామ్ మీద ఉన్న వారు... వద్దని పదే పదే వారిస్తున్నారు. అయిన.. పట్టించుకోకుండా రైలుకు ఎదురుగా వెళ్లి నిలబడింది. దీంతో అక్కడున్న వారి అరుపులు విని ఆర్పీఎఫ్ పోలీసు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అదే విధంగా, మరో మోటల్ మ్యాన్ కూడా ఆమెను గమనించాడు.
A woman attempted suicide in front of local train ???????? #Mumbai @Central_Railway RPF saved her pic.twitter.com/essLR9hf7c
— Arjun Dhfc ???? (@ArjunMahiDhfc) August 28, 2022
అతను కూడా ఆమెను కాపాడటానికి వచ్చాడు. ఇద్దరు కలిసి, ఆమెను రైలు ముందు నుంచి పక్కకు తప్పించారు. ఆ తర్వాత వెంట్రుక వాసిలో ప్రాణాలతో బయటపడిన యువతిని వారు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యువతిని కాపాడిన ఆర్పీఎఫ్, మోటర్ మ్యాన్ లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అదే విధంగా వారు చేసిన పనికి హ్యట్సాఫ్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt to suicide, Metro Train, Mumbai, Viral Video