తన అనుమతి లేకుండా తనను ఈ భూమి మీదకు తెచ్చినందుకు, తనను పుట్టించినందుకు ఓ ‘పుత్రరత్నం’ తన తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వారిని కోర్టుకు ఈడుస్తానని చెబుతున్నాడు. వింతగా ఉన్నా.. ఇది నిజమే. ముంబైకి చెందిన 27 ఏళ్ల రఫాయిల్ శామ్యూల్ అనే యువకుడు తన తల్లిదండ్రుల మీద కోర్టులో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్టు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు.
నమూనా చిత్రం (Photo:AFP
పిల్లల్ని కనడం నైతికంగా తప్పని, దాని వల్ల భూమిపై భారం పడుతోందని, వనరులు తగ్గిపోతున్నాయనేది అతని వాదన. ‘పునరుత్పత్తి’ అనే విధానాన్నే వ్యతిరేకిస్తూ ఓ బృందం పనిచేస్తుంది. మనిషి జన్మ అనేది ఎందో బాధలతో కూడుకుందని, అందువల్ల ప్రజలు పిల్లల్ని కనడం మానేయాలని వారు బోధిస్తుంటారు. రఫాయిల్ శామ్యూల్ కూడా ఆ గ్రూపులో చేరాడు.
రఫాయిల్ శామ్యూల్
తల్లిదండ్రులను కోర్టుకు లాగాలనుకుంటున్న శామ్యూల్‌కి వారంటే ఇష్టం లేదనుకోవడానికి వీల్లేదు. వారిని అతడు ఎంతో ప్రేమిస్తాడు. అయితే, వారు వారి ‘ఆనందం, సుఖం కోసం’ తనను పుట్టించారంటూ ఫేస్ బుక్ పేజీలో రాశాడని ద గార్డియన్ వెబ్సైట్ పేర్కొంది. అయితే, ఈ పోస్ట్ తర్వాత డిలీట్ అయింది. కానీ, పునరుత్పత్తిని వ్యతిరేకిస్తూ అతను చేసిన ఇతర పోస్టులు మాత్రం ఉన్నాయి. ‘ఎవరో తమ సుఖం కోసం నన్ను కంటే, నేనెందుకు కష్టపడాలి? నేనెందుకు పనిచేయాలి?’ అంటూ చేసిన పోస్ట్‌లను అతని ఫేస్ బుక్ వాల్ మీద చూడొచ్చు.
రఫాయిల్ శామ్యూల్ ఫేస్ బుక్ పేజీలో రాసిన వ్యాఖ్యలు
అయితే, ఇలాంటి పుత్రరత్నాన్ని కన్న తల్లి కూడా సరిగ్గానే స్పందించింది. ‘తల్లిదండ్రులు న్యాయవాదులని తెలిసి కూడా, వారిని కోర్టుకు లాగాలన్న నా కొడుకు నిర్ణయాన్ని అభినందిస్తున్నా. అయితే, అతడి వాదనకు సరైన సమాధానం అతనే చెప్పాల్సి ఉంటుంది. అతడిని పుట్టించడానికి మేం అతడి అనుమతి ఎలా అడగగలం?. ఈ విషయాన్ని శామ్యూల్ చెబితే నేను క్షమాపణ చెబుతా.’ అని అతని తల్లి కవితా కర్నాడ్ శామ్యూల్ స్పందించింది.
రఫాయిల్ శామ్యూల్ వ్యాఖ్యలకు స్పందిస్తూ అతని తల్లి చేసిన కామెంట్స్
ఇలాంటి మతిలేని చెత్త వాదనలు చేయొద్దంటూ చాలా మంది శామ్యూల్‌కి సూచించినా, అతడు మాత్రం తన అభిప్రాయాలను నిస్సంకోచంగా ఫేస్బుక్ పేజీలో పంచుకుంటున్నాడు. నిహిల్ అనంద్ అనేపేరుతో ఉన్న అకౌంట్లో ఈ పోస్టులను చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.