Paan Price : ఇతని షాపులో ఒక పాన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఒక పాన్ ఖరీదు ఎంతంటే
Paan Costing Rs 1 Lakh : పాన్.. భారత సంస్కృతిలో ఓ భాగం. పాన్ లో వందల రకాలున్నాయి. ముంబైకి చెందిన ఓ MBA గ్రాడ్యుయేట్ ఒకరు ప్రత్యేక పదార్థాలతో నిండిన పాన్‌ను రూ. 1 లక్షకి విక్రయిస్తున్నారు. ముంబైలో.పాన్ తినాలంటే నౌషాద్ భయ్యా చేతిపానే తినాలంటారు పాన్ ప్రియులు.
Costly Paan : పాన్.. భారత సంస్కృతిలో ఓ భాగం అని చెప్పాలి. పాన్ ని మనదేశంలో సంప్రదాయంగా తాంబూలంగా పిలుస్తాం. కిళ్లీ అని కూడా దీనిని పిలుస్తాం. భోజనం అయ్యాక తాంబూలం వేసుకోవటం మన పూర్వికుల సంప్రదాయం .అదే తాంబూలం షాపుల్లో ఎన్నో రకాలుగా దొరుకుతోంది. దాన్ని పాన్ అంటాం. తమలపాకు,సున్నం, వక్క కలిపిన దాన్ని తాంబూలం అంటాం. అదే పాన్ అయితే దాంట్లో ఇంకా సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. పాన్ లో వందల రకాలున్నాయి. దేని రుచి దానిదే. దేని ప్రత్యేకత దానిదే. వీటి ధరలు కూడా దానికి తగినట్లే ఉంటాయి.
సాధారణంగా ఒక పాన్ ఖరీదు పదుల్లో లేదా మహా అయితే వందల రూపాయల్లో ఉంటుందనేదే చూశాం ఇప్పటిదాకా. కానీ..ముంబైలోని ఓ షాపులో లభించే ఓ పాన్ ధర మాత్రం అక్షరాలా లక్ష రూపాయలు. ముంబైకి చెందిన MBA గ్రాడ్యుయేట్ ఒకరు ప్రత్యేక పదార్థాలతో నిండిన పాన్‌ను రూ. 1 లక్షకి విక్రయిస్తున్నారు.
ముంబైలోని మాహిమ్ ప్రాంతంలో నౌషాద్ షేక్ అనే వ్యక్తి ఎంఎన్సీలో ఉద్యోగాన్ని వదిలి "ది పాన్ స్టోరీ" పేరుతో పాన్ షాపు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల రుచుల్లో పాన్లను తయారు చేసి విక్రయిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఆయన పాన్ కు మంచి పేరుంది ముంబైలో.పాన్ తినాలంటే నౌషాద్ భయ్యా చేతిపానే తినాలంటారు పాన్ ప్రియులు. ఈక్రమంలో నౌషాద్ తనదైన స్టైల్ లో ఓ పాన్ తయారు చేశారు. దానికి ‘తాజ్‌మహల్ పాన్’ అని పేరు పెట్టారు. తాజ్ మహల్ పాన్ ను ఎవరికైనా గిఫ్టుగా ఇస్తే జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండేలా దీన్ని తయారు చేసానని తెలిపారు నౌషాద్.
‘ప్రేమ పరిమళం’ పేరుతో ప్రత్యేక పాన్ ను నౌషాద్ విక్రయించేవారు. దీని ధర రూ.1 లక్ష. అందులో రెండు అత్తరు సీసాలను కానుకగా ఇచ్చేవాడు. అయితే కస్టమర్లు ఇంకా ఎక్కువ రకాలు సెంట్లు ఉంటే బాగుంటుందని చెప్పారు. తాను తయారు చేసిన ప్రత్యేక పాన్‌తో తాజ్‌మహల్‌ను ఇవ్వాలని నిర్ణయించాడు. దీనికి ఉండే ఐదు గోపురాల నుంచి ఐదు రకాల అత్తరు సువాసనలు వెదజల్లేలా సీసాలను అమర్చాడు. అంతేకాదు ఆ గోపురాలకు పేర్లు కూడా పెట్టారు నౌషాద్. నౌషాద్ షాపులో రూ.35 నుంచి రూ. లక్ష విలువ చేసే పాన్లు అనేక రకాలు లభిస్తాయి. నౌషాద్ షేక్ యాజమాన్యంలోని ఈ దుకాణం బ్రిటన్ మరియు దుబాయ్ వంటి దేశాల నుండి ఖాతాదారులను ఆకర్షిస్తుంది. ఈ దుకాణంలో విక్రయించే పాన్ పొగాకు రహితంగా ఉంటుందని నౌషాద్ తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.