రెండు ఉడకబెట్టిన కోడిగుడ్ల ధర రూ.1700...జోకులు పేలుస్తున్న నెటిజన్లు...

కోడిగుడ్ల బిల్లు (Twitter)

తాను చేసిన ఆర్డర్‌ చేసిన ఫుడ్ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తాను ఆర్డర్ చేసిన రెండు ఉడకబెట్టిన కోడిగుడ్ల ధర ఏకంగా రూ.1700 వేశారు. అంతేకాదు రెండు ఆమ్లెట్ల ధర సైతం రూ.1700 వసూలు చేయడంతో ఆ రచయితకు ఏం చేయాలో అర్థంకాలేదు.

  • Share this:
    రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఏకంగా రూ.1700 వసూలు చేసిందని ఓ రచయిత ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే, ‘ఆల్‌ ద క్వీన్స్‌ మెన్‌’ పుస్తక రచయిత కార్తీక్‌ దార్‌ ఇటీవల ముంబైలోని ఓ లగ్జరీ హోటల్లో బస చేశాడు. అయితే అక్కడ తాను చేసిన ఆర్డర్‌ చేసిన ఫుడ్ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తాను ఆర్డర్ చేసిన రెండు ఉడకబెట్టిన కోడిగుడ్ల ధర ఏకంగా రూ.1700 వేశారు. అంతేకాదు రెండు ఆమ్లెట్ల ధర సైతం రూ.1700 వసూలు చేయడంతో ఆ రచయితకు ఏం చేయాలో అర్థంకాలేదు. వెంటనే బిల్లును క్లిక్ మనిపించి తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ఆ మధ్య రెండు అరటి పళ్లకకు ఏకంగా రూ.443 బిల్లు వసూలు చేయడంతో నానా హంగామా సృష్టించిన రాహుల్‌ బోస్‌ను ట్యాగ్‌ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.

    అయితే ఈ ట్వీట్‌పై ఫన్నీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ గుడ్ల నుంచి బంగారం వచ్చిందా అని అవి డైనోసర్ గుడ్లా అని మరొకరు కామెంట్‌ చేశారు. అయితే మొత్తం బిల్లు దాదాపు రూ. 6938 అవ్వడం గమనార్హం.
    First published: