హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుంది..కాదు కాదు వచ్చేసిందంటున్న ముంబై టెక్కీ..

Viral News: ప్రతీ కుక్కకు ఓ రోజు వస్తుంది..కాదు కాదు వచ్చేసిందంటున్న ముంబై టెక్కీ..

Stray dogs(Photo:Twitter)

Stray dogs(Photo:Twitter)

Mumbai: QR కోడ్‌తో కుక్క పేరు, దాని హెల్త్ ప్రొఫైల్, యజమాని పేరు,వివరాలతో కూడిన సమాచారం, సంప్రదించాల్సిన నెంబర్లు అన్నీ తెలుస్తాయి. కుక్క మెడలో వేసిన ఆ ట్యాగ్‌తో కంప్లీట్ డాగ్ డేటా మొత్తం వస్తుంది. ఇదంతా ఎవరు కనిపెట్టారో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

మనుషులకే కాదు వీధి కుక్కల(Stray dogs)కు ఓ గుర్తింపు ఉండాలని గొప్ప ఆలోచన చేశాడు ముంబై(Mumbai)కి చెందిన ఓ ఇంజనీర్. అక్షయ్ రిడ్లాన్ (Akshay Ridlan)అనే డేటా ఇంజనీర్ వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ క్యూ ఆర్ కోడ్‌(QR Code)ని డెవలప్ చేశాడు. ఇదంతా ప్రత్యక్షంగా ప్రభుత్వానికి ఎంతో మేలు చేయడానికి దోహదపడుతుందని ముంబై టెక్కీ అక్షయ్ తెలిపారు. ఈ క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ట్యాగ్‌ శునకం మెడలో ఉండటం వల్ల వీధి కుక్క గుర్తింపు, అవి ఎక్కడున్నాయి..వాటికి టీకాలు వేయడానికి, స్టెరిలైజేషన్ కోసం ప్రభుత్వానికి ఈజీగా ఉంటుందని పేర్కొన్నాడు. అంతే కాదు కుక్క మెడలోని ట్యాగ్‌ ఆధారంగా దాని డేటా బేస్ మొత్తం భద్రంగా వెబ్‌సైట్‌లో ఉంటుందని ఈ ఇంజనీర్ చెప్పాడు.

వీధి కుక్కలకు ఓ ట్యాగ్..

మనుషుల్నే పట్టించుకునే వాళ్లు కరువైన ఈరోజుల్లో వీధుల్లో తిరిగే కుక్కలు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ కనిపించే శునకాల కోసం ఓ ప్రత్యేకమైన టెక్నాలజీని అభివృద్ధి చేశాడు ముంబైకి చెందిన ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్. తనకున్న మేధాశక్తితో తక్కువ ఖర్చుతో వీధి కుక్కలకు ఓ గుర్తింపు..వాటి వల్ల సమాజానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ట్యాగ్‌లను రూపొందించాడు. న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇలాంటి ట్యాగ్‌లు మనుషులే కాదు కుక్కలకు తగిలించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ప్రభుత్వానికి తెలియజేస్తానంటున్నాడు.

డిజిటల్ రూపంలో వివరాలు..

ముంబై టెక్కీ అద్భుత సృష్టితో కుక్క ఏ ప్రదేశంలో ఉందో ..దానికి టీకాలు వేశారా ..లేదా అలాగే దానికి స్టెరిలైజేషన్ కోసం ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం కావాలనే విషయాన్ని తెలుసుకునేలా ఓ డేటా బేస్‌ని రూపొందించాడు. తన ఐడియాతో రూపొందించిన క్యూ ఆర్ కోడ్‌తో రూపొందించిన ట్యాగ్‌ని ప్రభుత్వానికి నామమాత్రపు ధరకు అందించాలనుకుంటున్నానని చెప్పాడు.

ముంబై ఇంజనీర్ రూపకల్పన..

అంతే కాదు డాగ్ లవర్స్ , వీధి కుక్కల్ని రక్షించే వాళ్లు, రోడ్లపై ఉండే కుక్కలకు ఆహారం అందించే సంస్థలను కూడా ట్రాక్ చేయడానికి తాను రూపొందించిన టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నాడు. ముంబై ఇంజనీర్ సృష్టించిన ఈ ట్యాగ్‌లోని ఫీచర్లను వివరించాడు. శునకం పేరు, లింగం, కేర్‌టేకర్ ఎవరైనా ఉంటే వారి ఫోన్‌ నెంబర్‌ను జత చేసి డిజిటల్ నివేదికను రూపొందిస్తుందని పేర్కొంది. అది పని చేసే విధానాన్ని వివరించారు. రిఫ్లెక్టివ్ కాలర్‌తో QR కోడ్‌ను జోడించి ఆపై నా ఫోన్‌లోని స్కానర్‌తో QRని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత కుక్క పూర్తి వివరాల్ని డిజిటల్‌గా రూపంలో తనకు వచ్చేలా డిజైన్ చేసినట్లుగా తెలిపారు. ఒకరకంగా చెప్పాలంటే మనుషులకు ఆధార్‌ కార్డ్‌పైన ఏ విధంగా లింగం, సంరక్షకుని పేరు, సంరక్షకుని ఫోన్ నంబర్, కుక్క వైద్య/వ్యాక్సినేషన్ చరిత్రను సృష్టిస్తుందని తెలిపారు ఇంజనీర్ అక్షయ్.

హర్షిస్తున్న డాగ్ లవర్స్‌..

ముంబైకి చెందిన ఈ 23సంవత్సరాల యువ ఇంజనీర్ వీధి కుక్కల కోసం అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీకి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో జంతు ప్రేమికులు, డాగ్ లవర్స్‌ నుంచి విశేష స్పందన వస్తోంది.

తెలుసుకోవడం ఈజీ..

అంతే కాకుండా క్యూ ఆర్ కోడ్ పని తీరుతో పాటు కుక్క ఎవర్నైనా కరిచిందా లేదా అనే డిటెయిల్స్‌ కూడా తెలుసుకునే విధంగా దాని డేటాబేస్ ఎంత కాలం వరకు ఉంటుంది..? దీన్ని అప్ డేట్ చేయడం ఎలా అనే విషయాలపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

మరి మీ అభిప్రాయం ఏంటీ..

వీధి కుక్కల గుర్తింపు కోసం ఓ ఇంజనీర్ ఈవిధమైన క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ట్యాగ్‌ని కనిపెట్టడం ఎంత వరకు ఉపయోగం అనే దానిపై చర్చ జరుగుతోంది. ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పవచ్చు.

First published:

Tags: Mumbai, Stray dogs, VIRAL NEWS

ఉత్తమ కథలు