• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • MUMBAI COP MURALI JADHAV CAPTURED SIX FOOT PYTHONWITH HIS BARE HANDS VIDEO GOES VIRAL KRS

Viral Video: 'సింగం, దబాంగ్ అన్నీ కలిపితేనే ఈ పోలీసు'​.. ఉత్తి చేతులతో భారీ కొండచిలువను

Viral Video: 'సింగం, దబాంగ్ అన్నీ కలిపితేనే ఈ పోలీసు'​.. ఉత్తి చేతులతో భారీ కొండచిలువను

Twitter Image

Super cop: కాలికి గాయమైనా ఏకంగా ఆరు అడుగుల పొడవు ఉన్న ఓ కొండ చిలువ (Python)ను పట్టి ముంబై కానిస్టేబుల్ ఒకరు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.  

  • Share this:
    ఓ పోలీసు కానిస్టేబుల్ అత్యంత సాహసం ప్రదర్శించారు. భయం లేకుండా ఏకంగా ఆరు అడుగుల కొండచిలువను ఉత్తి చేతులతో పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పోలీస్​ను సూపర్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు.

    ముంబైలోని ధారావిలో ఓ ఇంట్లో భారీ కొండచిలువ చొరబడింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన అక్కడి ప్రజలు పోలీసులకు ఫోన్ చేశారు. కాలు సరిగా లేకపోయినా.. కానిస్టేబుల్ మురళీధర్ జాదవ్​ కొండ చిలువను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఒత్తి చేతులతోనే దాన్ని ఒడిసిపట్టారు. ఆ సమయంలో ప్రజలు పోలీసులకు అభినందనుల తెలిపారు. చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటన డిసెంబర్ 31న జరుగగా.. వీడియోను ముంబై పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాలికి గాయమైనా కానిస్టేబుల్ మురళీ ధర్ జాదవ్​ ఆరు అడుగుల కొంచ చిలువను పట్టుకున్నారని పోస్ట్ చేశారు.


    పోలీసు మురళీధర్ జాదవ్​ ధైర్యాన్ని సోషల్ మీడియాలో అనేక మంది ప్రశంసిస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర మంత్రి అనిల్ దేశ్​ముఖ్​ కూడా ఈ సూపర్ పోలీస్​ను అభినందించారు. “పోలీసు మురళీధర్ జాదవ్​ ధారావిలోని ఓ ఇంట్లో చొరబడిన కొండ చిలువను పట్టుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన చూపిన ధైర్య సాహసాలు అత్యత్భుతం” అని దేశ్​ముఖ్ ట్వీట్ చేశారు.



    नागरिकांसाठी सर्वकाही !




    “సింగం, దబాంగ్ ఆల్​ఇన్ వన్​. సూపర్ సే ఊపర్. ఎంతో ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరిస్థితిని పోలీసు జాదవ్​ ఎదుర్కొన్నారు. హ్యాట్సాఫ్​” అని ఓ యూజర్ వీడియోకు కామెంట్ చేస్తే.. సమయానికి ధైర్యం ప్రదర్శించి, 2020 చివరి రోజు ఎలాంటి ప్రమాదం జరుగకుండా కాపాడిన పోలీస్​కు ధన్యవాదాలు అంటూ మరికొందరు రాసుకొచ్చారు. లైఫ్ ను రిస్క్ చేసి ప్రజలతో పాటు కొండ చిలువను కూడా కాపాడారని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
    Published by:Krishna P
    First published: