MUMBAI BOY AIMAN SOLVES RUBIKS CUBE WITHOUT LOOKING AT PUZZLE MASTER BLASTER SACHIN TENDULKAR SHARES THAT VIRAL VIDEO NK
చూడకుండానే రూబిక్ క్యూబ్ సెట్ చేసిన కుర్రాడు... వీడియో షేర్ చేసిన సచిన్ టెండుల్కర్
చూడకుండానే రూబిక్ క్యూబ్ సెట్ చేసిన కుర్రాడు (image credit - instagram)
Rubik's Cube: రూబిక్ క్యూబ్‌ని సెట్ చెయ్యాలంటే 75 సంవత్సరాలు పడుతుందనేది ఓ సైంటిఫిక్ లెక్క. అలాంటిది ఆ కుర్రాడు... క్షణాల్లో సెట్ చేశాడు. వీడియో చూడండి.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్... అప్పుడప్పుడూ నెటిజన్లకు తన ట్వీట్లు, పోస్టులతో ఆనందాన్ని పంచుతాడు. తాజాగా మాస్టర్... ఓ ముంబై కుర్రాడిని పరిచయం చేశాడు. ఆ కుర్రాడు రూబిక్ క్యూబ్ వైపు చూడకుండానే దాన్ని క్షణాల్లో సెట్ చేశాడు. "అది షాకింగ్ విషయం. మన కళ్లతో మనం నమ్మలేం" అని సచిన్ టెండుల్కర్ తన పోస్టుకు క్యాప్షన్ పెట్టాడు. సచిన్ ముందే ఇది చేసి చూపించాడు ఆ కుర్రాడు. అతని పేరు మహ్మద్ అయిమన్ కోలీ. రూబిక్ క్యూబ్ వీడియోను షేర్ చేసిన సచిన్... ఆ కుర్రాడి టాలెంట్‌ను మెచ్చుకున్నాడు. ఓ రోబో ఎలాగైతే... సెట్ చేస్తుందో... అలాగే ఆ కుర్రాడు కూడా తలపై రూబిక్ క్యూబ్ ఉంచి సరిచేయడం షాకింగే మరి.
"నేను అయిమన్ కోలీతో ఉన్నాను. మీకు తెలుసుగా ఇదేంటో... రూబిక్ క్యూబ్. నేను దీన్ని ఇష్టమొచ్చినట్లు కదిపేసి... ఆ కుర్రాడికి ఇస్తాను. తను దీన్ని చూడకుండానే సరిచేస్తాడు." అని సచిన్ తన పోస్టులోని వీడియోలో నెటిజన్లతో చెప్పాడు. ఆ తర్వాత సచిన్ ఆ క్యూబ్‌ని అయిమన్కి ఇచ్చాడు. అయిమన్ కొన్ని క్షణాలపాటూ ఆ క్యూబ్‌ని చూశాడు. ఆ తర్వాత దాన్ని తలపై పట్టుకొని... దాని వైపు చూడకుండానే సెట్ చేశాడు. వీడియో చూడండి.
సచిన్ చెప్పినట్లు అయిమన్ గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించాడు. ఇలాగే క్యూబ్ వైపు చూడకుండానే దాన్ని వేగంగా సెట్ చేసి రికార్డ్ నమోదు చేశాడు. ఈ వీడియోలో జస్ట్ 17 సెకండ్లలో క్యూబ్‌ని సెట్ చేశాడు అయిమన్. అది చూసిన సచిన్... అతని నెక్ట్ ఛాలెంజ్... దాన్ని తనకు నేర్పించడమే అని చమత్కరించాడు.
అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్లు సచిన్ తెలిపాడు. "నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. మనలో చాలా మంది క్యూబ్ వైపు చూస్తూ కూడా దాన్ని సెట్ చెయ్యలేం." అన్నాడు.
ఈ పోస్టుకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కామెంట్ల తుఫాను కురుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్ లీ... "అది నమ్మలేకపోతున్నాను" అని కామెంట్ రాశాడు. ఇంకా చాలా మంది చాలా రకాలుగా స్పందించారు.