హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Transgender: అధికారుల వినూత్న ఆలోచన.. ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక మరుగు దొడ్లు.. ఎక్కడంటే..

Transgender: అధికారుల వినూత్న ఆలోచన.. ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక మరుగు దొడ్లు.. ఎక్కడంటే..

ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక టాయిలెట్లు.

ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక టాయిలెట్లు.

Mumbai: సాధారణంగా ప్రభుత్వాలు..ప్రజల కోసం రోడ్లపై, పలు కాంప్లెక్స్ లలో పబ్లిక్ టాయ్ లెట్లను ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలో ట్రాన్స్ జెండర్ వారు పలు చోట్ల వివక్షతను ఎదుర్కొంటున్నారు. దీని కోసం ముంబై అధికారులు వినూత్నంగా ఆలోచించారు.

Public toilet designed for the transgender: ప్రజల కోసం ప్రభుత్వాలు పలు వసతులు కల్పిస్తాయి. దీనిలో భాగంగా రోడ్లపై టాయ్ లెట్లు, మరుగుదొడ్లను నిర్మిస్తాయి. దీనిలో మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేక మైన గదులు ఉంటాయి. కొన్ని చోట్ల ప్రైవేటు సంస్థలు.. సులభ్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేస్తాయి. అయితే, ప్రధానంగా కొన్ని చోట్ల ట్రాన్స్ జెండర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని చాలా చోట్ల అనుమతించరు.

ఈ క్రమంలో వీరు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు. వారు మనలాంటి వారే. దీనిలో దృష్టి లో పెట్టుకుని పలు రాష్ట్రాలు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ లు కల్పిస్తున్నాయి. తాజాగా, ముంబై అధికారులు వినూత్నంగా ఆలోచించారు. కేవలం ట్రాన్స్ జెండర్ కోసమే ప్రత్యేక మైన టాయ్ లెట్లను ఏర్పాటు చేశారు.


ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో సారథి ఫౌండెషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ టాయిలెట్ ను ప్రారంభించారు. దీన్ని కేవలం ట్రాన్స్ జెండర్స్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. దీంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న వివక్షతను నిరోధించాలనే ఉద్యేష్యంతోనే టాయ్ లేట్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని, నగరంలోని ఇంకా పలు చోట్ల మరుగు దొడ్లను నిర్మించాలని పలువురు ట్రాన్స్ జెండర్స్ కోరుతున్నారు.

First published:

Tags: Maharashtra, Mumbai, Transgender

ఉత్తమ కథలు