సాహో ప్రమోషన్ షురూ.. బాహుబలి ఎఫెక్ట్ భారీగా పడిందంటున్న ప్రభాస్..

‘సాహో’ ట్రైలర్ (ట్విట్టర్ ఫోటో)

భారీ అంచనాలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సాహో సినిమా ఈ నెల 30న విడుదల అవుతోంది. అయితే, ఈ రోజు ఈ సినిమా ప్రమోషన్ మొదలైంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్, నిర్మాత ప్రమోద్, దర్శకుడు సుజిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

  • Share this:
బాహుబలి సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా.. సాహో. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల అవుతోంది. అయితే, ఈ రోజు ఈ సినిమా ప్రమోషన్ మొదలైంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్, నిర్మాత ప్రమోద్, దర్శకుడు సుజిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ట్రైలర్ కోసం 134 కట్స్ చేశామని, పాటల సౌండింగ్ కొత్తగా ఉందని చాలా కష్టమైందని ప్రభాస్ తెలిపాడు. శ్రద్ధా కపూర్ యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా చేసిందని, సినిమాలో యాక్షన్ లవ్ స్టోరీని చూపిస్తామని వెల్లడించాడు. ఈ సినిమా తర్వాత మీరు బాలీవుడ్ బాద్‌షా అవుతారా? అని ప్రభాస్‌ను అడగ్గా.. అది చాలా పెద్ద పదం అని తాను ఎంత ఒదిగి ఉంటానో వివరించాడు.

సాహో‌పై బాహుబలి ప్రభావం ఎంతలా పడిందని అడగ్గా.. భారీగానే పడిందని, బడ్జెట్ కూడా ఎక్కువగా పెట్టాల్సి వచ్చిందని ప్రభాస్ తెలిపాడు. బాహుబలి ఫ్యాన్స్‌కు వినోదం అందించడమే తమ లక్ష్యమని అన్నాడు. ఇక, హిందీలో డబ్బింగ్ చెప్పడానికి ఓ మాస్టర్‌ను పెట్టుకున్నానని చెప్పాడు. శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. బహు భాషల్లో వస్తున్న ఈ సినిమాలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రభాస్ అమేజింగ్ కోస్టార్ అని, జెన్యూన్‌గా ఉంటాడని వెల్లడించింది.
First published: