Home /News /trending /

MUKHESH AMBANI COUPLE VISIT SIDDIVINAYAKA TEMPLE AT MUMBAI ALONG WITH YOUNGER SON ANANT AMBANI PS

సిద్ధి వినాయకుడికి తొలి శుభలేఖ.. ముఖేష్ అంబానీ దంపతుల ప్రత్యేక పూజలు

సిద్ధివినాయక ఆలయంలో అంబానీ కుటుంబం

సిద్ధివినాయక ఆలయంలో అంబానీ కుటుంబం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం రాబోయే మార్చి 9న అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  ముఖేష్ అంబానీ దంపతులు ముంబైలోని ప్రముఖ సిద్ధివినాయక దేవస్థానాన్ని దర్శించుకున్నారు. త్వరలోనే వారి పెద్దకుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం జరగనున్న నేపథ్యంలో తొలి శుభలేఖను.. స్వామివారికి అందజేశారు. ఈ సాయంత్రం చిన్న కుమారుడు అనంత అంబానీతో కలిసి దేవాలయానికి వచ్చిన నీతా, ముఖేష్‌ అంబానీలు సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పాదాల చెంత పెద్ద కుమారుడి శుభలేఖను ఉంచారు.

  ఇటీవలె కుమార్తె ఇషా అంబానీ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన అంబానీ దంపతులు.. ఆరు నెలల వ్యవధిలోనే పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహాన్ని చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే మార్చి 9న ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా  కుమార్తె శ్లోకా మెహతాతో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. వీరి వివాహంపై ఇరు కుటుంబాలు ఇషా అంబానీ వెడ్డింగ్ సమయంలోనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ అంబానీ పెళ్లి శుభలేఖను తొలిగా సిద్ధివినాయక స్వామివారికి అందజేశారు అంబానీ దంపతులు.

  గతేడాది డిసెంబర్ 12న ముంబైలోని తమ నివాసంలోనే అత్యంత గ్రాండ్‌గా కూతురు ఇషా పెళ్లిని నిర్వహించిన అంబానీ దంపతులు.. ఆకాశ్ అంబానీ వివాహాన్నీ మాత్రం జియో వరల్డ్ సెంటర్‌లో చేయబోతున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇషా పెళ్లి మాదిరిగానే ఆకాశ్ వెడ్డింగ్‌కు కూడా వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరుకానున్నారు.

  First published:

  Tags: Isha Ambani, Mukesh Ambani, Mumbai, Nita Ambani

  తదుపరి వార్తలు