హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Worlds Highest Tea Party : మీరు మూములోళ్లు కాదు సామీ..ఏకంగా ఎవరెస్ట్ పైనే టీ పార్టీ

Worlds Highest Tea Party : మీరు మూములోళ్లు కాదు సామీ..ఏకంగా ఎవరెస్ట్ పైనే టీ పార్టీ

ప్రపంచంలోనే ఎత్తైన టీ పార్టీ

ప్రపంచంలోనే ఎత్తైన టీ పార్టీ

.Tea Party On MT Everest : ఎవరెస్ట్..ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో ఉంది. కాగా,8,848 మీటర్లు.. 29,028 అడుగులతో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో వందలాది మంది ప్రతి ఏటా ప్రయత్నిస్తుంటారు.

ఇంకా చదవండి ...

.Tea Party On MT Everest : ఎవరెస్ట్..ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్రమట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో ఉన్నది. ఇది నేపాల్ లో ఉంది. కాగా,8,848 మీటర్లు.. 29,028 అడుగులతో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో వందలాది మంది ప్రతి ఏటా ప్రయత్నిస్తుంటారు. అయితే వారి కలల సాకారానికి నేపాలీ గైడ్లు, పోర్టర్లు ఎంతో సహకరిస్తుంటారు. ప్రతి సాహసయాత్ర కోసం అవసరమైన టెంట్లు, ఆహారం, ఆక్సిజన్, తాగునీటి బాటిళ్లను ఎత్తైన శిబిరాలకు మోసుకెళ్లే క్రమంలో అనేక మంది ప్రమాదాలబారినపడి చనిపోతుంటారు. దీంతో ఎవరెస్ట్‌పై మరణించే వారిలో దాదాపు మూడోవంతు వీరే ఉంటారు.

అయితే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్(Mount Everest)శిఖరంపై గడ్డకట్టే చలిలో వేడివేడి టీ తాగితే ఆ కిక్కే వేరు. తాజాగా అలాంటి ఆనందాన్ని పొందిన కొందరు పర్వతారోహకులు. తాజాగా కొంతమంది పర్వతారోహకులు, సాహసికులూ కలిసి ఎవరెస్ట్ పై టీ పార్టీ(Tea Party On Everest)చేసుకున్నారు. స‌ముద్ర‌మ‌ట్టానికి 21,312 అడుగుల ఎత్తుకెళ్లి టీ తాగారు. పెద్ద కప్పుల్లో వేడి వేడి టీ పోసుకొని సిప్ చేస్తూ కురుస్తున్న మంచును బాగా ఎంజాయ్ చేశారు. ఎవరెస్ట్ క్యాంప్ 2లో ఇది జరిగింది. అథ్లెట్‌, ప‌ర్వ‌తారోహ‌కుడు అయిన ఆండ్రూ హ్యూస్ త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఈ అద్భుత‌మైన ఫీట్‌ను సాధించారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో అత‌డికి ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. ఆ స‌మ‌యంలో ప్ర‌కృతిని చాలా మిస్ అయ్యాన‌ని, లాక్‌డౌన్ త‌ర్వాత త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఏదైనా సాహ‌సం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు హ్యూస్ తెలిపాడు. దీంతో ప్రపంచంలో అత్యంత ఎత్తులో జరిగిన టీ పార్టీ గా ఇది గిన్నీస్ వరల్ట్ రికార్డు నమోదుచేసింది.

ALSO READ CM Stalin : సాధారణ ప్రయాణికుడిలా బస్సు ఎక్కి ప్రయాణికులతో ముచ్చటించిన సీఎం స్టాలిన్

దీనికి సంబంధించిన వీడియోని గిన్నీస్ బుక్ వాళ్లు... ఇన్‌స్టాగ్రామ్‌లోని తమ పేజీ guinnessworldrecordsలో పోస్ట్ చేశారు. ఈ టీ పార్టీ ఈ సంవత్సరం జరిగింది కాదు. గతేడాది జరిగింది. గిన్నీస్ వాళ్లు ఇప్పటికి రికార్డుగా గుర్తింపు ఇచ్చారు. కరోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో తనకి ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌ని ఆ స‌మ‌యంలో ప్ర‌కృతిని చాలా మిస్ అయ్యాన‌ని, లాక్‌డౌన్ త‌ర్వాత త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఏదైనా సాహ‌సం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు హ్యూస్ తెలిపాడు అందులో భాగంగానే ఈ ఫీట్ చేసినట్లు చెప్పారు.

First published:

Tags: Tea, Viral