న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడేందుకు రాంచీ వచ్చిన టీమిండియా క్రికెటర్లకు కెప్టెన్ కూల్, మాజీ ఆటగాడు ధోనీ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఫస్ట్ టీ20 ఫైట్‌కు ముందు ప్రాక్టీస్ చేసేందుకు గ్రౌండ్‌కు వచ్చిన టీమిండియా ఆటగాళ్లలో ధోనీ జోష్ నింపాడు. ఎవరూ ఊహించని విధంగా గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ధోనీ. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లతో సరదాగా గడిపాడు. ఫస్ట్ మ్యాచ్‌ను గెలుపుతో ఆరంభించాలని పట్టుదలగా ఉన్న టీమిండియా శిబిరంలో ధోనీ రాకతో కొత్త బుస్ట్ వచ్చినట్లైంది. స్టేడియం లోపల కొబ్బరి నీళ్లు తాగుతూ కనిపించాడు ఈ కెప్టెన్ కింగ్. అటు ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో చాలా సేపు మాట్లాడాడు. ఇటు ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, యువ సంచలనం శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, చాహల్‌తో పాటు మిగిలిన క్రికెటర్లతోనూ మాట్లాడాడు ధోనీ. ఇక కోచ్‌లతో పాటు సహాయిక సిబ్బందిని పలకరించాడు మహేంద్రుడు.
Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! ????#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023
ధోనీ.. ధోనీ.. ధోనీ..!
రాంచీ వేదికగా మ్యాచ్ అనగానే అందిరకీ ధోనీనే గుర్తొచ్చాడు. ఈ మాజీ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై మూడేళ్లు అవుతున్నా.. మహేంద్రుడికి మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటు క్రికెటర్ల సంగతి సరే సరి..! ధోనీని ఎప్పుడు కలుద్దామా అని ఈగర్‌గా వెయిట్ చేశారు. ముందుగా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా రాంచీ వచ్చిరాగానే ధోనీ ఇంట్లో వాలిపోయాడు. ధోనీ బైక్ గ్యారేజ్‌కు వెళ్లి మరి అతనితో ఫోటోలు దిగాడు. షోలే-2 ఇజ్ కమింగ్ సూన్ అంటూ పాండ్యా పెట్టిన ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయింది. షోలే సినిమాలోని అమితాబ్, ధర్మేంద్రను ఇమిటేట్ చేస్తూ ఈ ఇద్దరు ఫోటో దిగారు. ఓ బైక్‌కి సైడ్‌కార్‌లో ధోనీని ఎక్కించుకున్న పాండ్యా..దాని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. షోలే సినిమాలో అమితాబ్, ధర్మేంద్ర ఓ పాటలో సేమ్ ఇలానే బైక్‌పై వెళ్తారు. డ్రైవర్ సీటులో ధర్మేంద్ర ఉంటే..ఇక్కడ మన పాండ్యా కూర్చున్నాడు. పక్కన సైడ్‌కార్‌లో సినిమాలో అమితాబ్ కూర్చుంటే ఇక్కడ ధోనీ కూర్చున్నాడు.
మ్యాచ్ చూడటానికి ధోనీ వస్తాడా..?
ఇక ఇవాళ జరిగే మ్యాచ్ చూడటానికి ధోనీ వస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ధోనీ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ ధోనీ వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.. స్టేడియమంతా 'ధోనీ ధోనీ' అరుపులతో మారుమోగిపోవడం ఖాయం. మరి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి సర్‌ప్రైజ్ చేసిన ధోనీ.. అభిమానులకు కూడా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడా అంటే వెయిట్ అండ్ సీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs nz t20 series, Ishan Kishan, MS Dhoni, Ranchi, T20