• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • MP ARAVIND MEETS 9 YEARS OLD BOY WHO IMITATES BANDI SANJAY SPEECH WITH EXPRESSIONS VIDEOS GOES VIRAL SSR

బీజేపీ సభలో బండి సంజయ్ మాటలకు తొడగొట్టిన బుడ్డోడు.. ఆ పిల్లాడిని ఇంటికి పిలిపించుకున్న ఎంపీ అర్వింద్ ఏం చేశారంటే...

బీజేపీ సభలో తొడగొడుతున్న నర్సింలు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సభలో మాట్లాడుతుంటే ఓ బాలుడు ఆయన మాటలకు భావోద్వేగంతో స్పందించాడు. అక్కడే ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్త ఒకరు తన మొబైల్‌లో ఆ దృశ్యాన్ని...

  • Share this:
    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సభలో మాట్లాడుతుంటే ఓ బాలుడు ఆయన మాటలకు భావోద్వేగంతో స్పందించాడు. అక్కడే ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్త ఒకరు తన మొబైల్‌లో ఆ దృశ్యాన్ని వీడియో తీసి బంధించాడు. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    MP Aravind, Telangana BJP, Bandi Sanjay, BJP Public Meeting, Banswada
    ధర్మపురి అరవింద్ ఇంటిలో నర్సింలు


    బీజేపీ సోషల్ మీడియా గ్రూప్స్‌లో ఈ వీడియో విస్తృతంగా ప్రచారం అయింది. ఈ వీడియోను చూసిన ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆ బుడ్డోడిని ఇంటికి పిలిపించుకున్నారు. ఆ కుటుంబం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆ పిల్లాడికి భోజనం పెట్టి, ఓ బహుమతి ఇచ్చి పంపించారు. ఈ చిన్నోడి పేరు నర్సింలు. తొమ్మిది సంవత్సరాల వయసు. రెండవ తరగతి చదివి మానేశాడు. బాన్సువాడ పట్టణం దుబ్బ కాలనీలో నివాసం ఉంటున్న వీరి కుటుంబం పాత సామాన్లు (వస్తువులు) అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.

    MP Aravind, Telangana BJP, Bandi Sanjay, BJP Public Meeting, Banswada
    ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంట్లో భోజనం చేస్తున్న నర్సింలు


    నర్సింలు కుటుంబానికి డబుల్ బెడ్ రూం రాలేదు. దీంతో.. అప్పటి నుంచి ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న నర్సింలు బాన్సువాడలో ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన బీజేపీ బహిరంగ సభకు వెళ్లాడు. ఆ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ ప్రసంగం చేస్తున్న సమయంలో.. సంజయ్ మాటలకు ఆకర్షితుడైన నర్సింలు తొడకొట్టాడు. ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ నేతల దృష్టిని ఆకర్షించిన నర్సింలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రెటీగా మారాడు.
    Published by:Sambasiva Reddy
    First published: