హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Moving House: 139 ఏళ్ల పురాతన ఇల్లు.. వేరే అడ్రస్‌కు తరలి వెళ్లింది.. వైరల్‌గా మారిన వీడియోలు..

Moving House: 139 ఏళ్ల పురాతన ఇల్లు.. వేరే అడ్రస్‌కు తరలి వెళ్లింది.. వైరల్‌గా మారిన వీడియోలు..

(Image- Twitter)

(Image- Twitter)

ఎప్పుడైనా ఓ భవనం వీధుల్లో కదలి వెళ్లడం చూశారా?.. అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే

  ఎప్పుడైనా ఓ భవనం వీధుల్లో కదలి వెళ్లడం చూశారా?.. అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఇంటిని ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వేరేచోటుకి తరలించారు. అది కూడా 139 ఏళ్ల పురాతన విక్టోరియా ఇంటిని. వివరాలు.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లీన్ స్ట్రీట్‌లో 1880లో ఇటాలియనేట్ స్టైల్‌లో ఈ భవనాన్ని నిర్మించారు. 807 నంబరు అడ్రస్‌తో గల ఈ ఇంటికి చాలా చరిత్ర ఉంది. రెండు అంతస్తుల ఆ ఇంటిలో ఆరు బెడ్ రూమ్‌లు, 3 స్నానాల గదులను కలిగి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఇంటి యజమాని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాల్సి. ఈ క్రమంలోనే తాను ఎంతగానో ఇష్టపడే ఆ ఇంటిని మరోక చోటుకు తరలించేందుకు నిపుణులను సంప్రదించాడు.

  అయితే ఈ భవంతి తరలింపు అనేది అంతా సులువుగా ఏం పూర్తి కాలేదు. ఈ ఇంటిని తరలించడానికి ఏనిమిదేళ్లుగా ప్రణాళికలు రచించారు. ఇంటిని తరలించే మార్గంలో చెట్ల కొమ్మలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, విద్యుత్ లైన్స్‌ను తాత్కాలికంగా తొలగించారు. అలాగే పలు ప్రభుత్వ సంస్థల అనుమతులు తీసుకున్నాడు. అనంతంరం చాలా జాగ్రత్తగా బిల్డింగ్‌ను లిఫ్ట్ చేసి ట్రాలీ మీద పెట్టారు. అనంతరం పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో దానిని ఆపరేట్ చేస్తూ అక్కడి నుంచి ఆరు బ్లాక్‌ల అవతల ఉన్న ఫుల్‌ట్రాన్ స్టీట్‌కు తరలించారు. అత్యధికంగా గంటకు ఒక మైలు వేగంతో ఈ తరలింపు ప్రక్రియను పూర్తి చేశాడు.


  ట్రాలీపై రోడ్డు మీద తరలివెళ్తున్న భవంతిని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున్న అక్కడి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ బిల్డింగ్‌ను తరలించడం కోసం ఆ ఇంటి యజమాని మొత్తంగా నాలుగు లక్షల డాలర్లు ఖర్చు చేశాడు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: USA

  ఉత్తమ కథలు