Most Thrilling Video : మన దేశంలోని అడవుల్లోకి వెళ్తే.. పొదల్లో ఏదో కదులుతూ కనిపిస్తుంది. అదేంటా అని భయపడుతూనే దగ్గరకు వెళ్తే.. ఏ ఎలుగుబంటో బయటకు వస్తుంది. దురదృష్టం వెంటాడితే.. ఆ పొదల్లోంచీ పులి, చిరుత లాంటివి కూడా రావచ్చు. ఇదే విధంగా అమెరికాలోనూ జరుగుతుంది. కాకపోతే.. అక్కడ ఎలుగుబంట్లు, కోయోట్స్, పర్వత సింహం (Mountain Lion) వంటివి వెంటాడతాయి. అందుకే అక్కడ అడవుల్లో తిరిగేవాళ్లు.. లైసెన్స్డ్ గన్ వెంట తీసుకెళ్తారు. అలా ఓ కణుజు (elk) వేటగాడు అమెరికాలోని ఇడాహోలో అడవిలోకి వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను తుళ్లి పడేలా చేస్తోంది.
కొంతదూరం అడవిలోకి వెళ్లిన అతనికి.. ఓ పర్వత సింహం ఎదురైంది. ఎలాగైనా అతనిపై దాడి చెయ్యాలని అది అనుకుంది. అతని వైపుగా నడుస్తూ రాసాగింది. అతను భయపడుతూ.. దాని వైపు చూస్తూ.. వెనక్కి అడుగులు వెస్తూ.. గన్ తీసి గురిపెట్టాడు. గో గో అంటున్నా.. అది అతనివైపు వస్తూనే ఉంది. ఆ క్షణం ఏం చెయ్యాలో అతనికి అర్థం కాలేదు. పరుగెడితే.. అది ఇట్టే దాడి చెయ్యగలదు. అలాగని దాన్ని కాల్చి చంపే ఉద్దేశం అతనికి లేదు. కానీ ఏం చెయ్యాలి... చావాలా... చంపాలా అనే ప్రశ్న అతనికి ఎదురైంది.
ఇది కూడా చదవండి: Bharat Jodo Yatra : నేడు రాహుల్ బహిరంగ సభ .. నెక్ట్స్ ఏంటి?
ఆ సింహ అంతకంతకూ దగ్గరకు వచ్చేస్తుండటంతో.. అతను ఓసారి గన్ ఫైరింగ్ చేశాడు. కొద్దిలో తప్పించుకున్న సింహం.. మరోసారి దాడి చెయ్యాలని చూసింది. మళ్లీ కాల్చాడు. మళ్లీ తప్పించుకున్న సింహం.. మళ్లీ దాడి చేద్దామని చూసింది. కానీ అతను మెల్లమెల్లగా వెనక్కి వెళ్లిపోతుండటంతో... ఇక ఆ సింహం వెళ్లిపోయింది. ఇదంతా వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు రెడ్డిట్ లోని anivia3346 అకౌంట్లో జనవరి 29, 2023న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ 12వేలకు పైగా అప్ ఓట్లు వచ్చాయి.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
చూశారుగా... మీ ముందే ఆ సింహం ఉన్న ఫీల్ కలిగిందా... అక్కడ మీరు ఉంటే ఏం చేస్తారు? నిపుణుల ప్రకారమైతే.. క్రూరమృగం ఎదురైనప్పుడు పరుగులు పెట్టకూడదు. అలా పెడితే.. ఆ మృగం మనల్ని తక్కువ అంచనా వేసి దాడి చెయ్యగలదు. అలా కాకుండా... మెల్లమెల్లగా వెనక్కి అడుగులు వేస్తూ... క్రూర మృగంవైపే చూస్తూ... పోపో అని గట్టిగా అరవాలి. తద్వారా అది వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే అడవుల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని పెద్దలు చెబుతుంటారు. ఏ పొదలో ఏది దాక్కుంటుందో ఎవరికి తెలుసు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending, Trending news, Trending video, Trending videos, Viral, Viral image, VIRAL NEWS, Viral photos, Viral Video, Viral Videos