అమెరికాలో ప్రజలను అప్పుడప్పుడూ పర్వత సింహాలు (Mountain Lions) వెంటాడుతూ ఉంటాయి. అవి జనావాసాల్లోకి పెద్దగా రావు. కానీ జనం అడవిలోకి వెళ్తే మాత్రం అవి వెంటాడతాయి. అలా ఓ వ్యక్తి... ఉతా రాష్ట్రంలోని ఓ లోయలో ఉన్న అడవిలోకి వెళ్లాడు. అతనేదో వీడియో తీసుకుందామని సరదాగా వెళ్లాడు. ఐతే... అక్కడో ప్రాంతంలో.. పిల్లి పిల్లల లాంటివి కనిపించాయి. వాటిని చూసిన అతను.. అరే.. అడవిలో ఈ పిల్లులేంటి అనుకున్నాడు. దగ్గరికి వెళ్లాడు. అపి పిల్లి పిల్లలు కావని అర్థమైంది. వామ్మో అనుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకునేలోపే.. ఎదురుగా పర్వత సింహం కనిపించింది.
తన పిల్లల జోలికి అతను వచ్చాడు అని ఫిక్స్ అయిన పర్వత సింహం.. అతనిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. దాంతో అతను బోబో అని అరుస్తూ... మెల్లగా వెనక్కి అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ పర్వత సింహం అతన్ని వెంటాడింది. అరుస్తూ అతనిపై దాడి చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. ప్రతిసారీ అతను గట్టిగా అరుస్తూ దాన్ని ఎలాగొలా నిలువరించగలిగాడు.
ఇలా అది 6 నిమిషాలపాటూ అతన్ని వెంబడించింది. దేవుడే దిక్కనుకుంటూ... నడుస్తూ వెనక్కి వెళ్లాడు. అలా వెళ్తూనే వీడియో రికార్డ్ చేశాడు. చివరకు ఓ ప్రాంతానికి వెళ్లాక.. బండరాయి తీయడంతో... ఆ సింహం వెళ్లిపోయింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు.
ఆ వీడియోని రెడ్డిట్‌లోని FridayCicero702 అకౌంట్‌లో జనవరి 31, 2023న పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకూ 7వేల మందికి పైగా అప్ ఓట్లు ఇచ్చారు.
ఆ వీడియోని ఇక్కడ చూడండి
నిజానికి ఇది ఇప్పుడు జరగలేదని... ఐదారేళ్ల కిందట జరిగిందని కొందరు నెటిజన్లు అంటున్నారు. కానీ ఇప్పుడు రెడ్డిట్‌లో మళ్లీ పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయ్యింది. ఒక రకంగా అతను అదృష్టవంతుడే అనుకోవాలి. ఆరు నిమిషాలు వెంటాడినా.. ఆ సింహం అతనిపై దాడి చెయ్యలేదు. అది దాడి చెయ్యాలి అనుకుంటే.. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. వన్య ప్రాణులు సాధారణంగా మనుషుల జోలికి రావు. కానీ మనుషులు తమ జోలికి వస్తే ఊరుకోవు. ఆ సింహం పిల్లల దగ్గరకు అతను వెళ్లాడు కాబట్టే.. అది వెంటాడింది. అడవుల్లో ఒంటరిగా వెళ్లేవారికి ఈ వీడియో ఓ హెచ్చరిక అంటున్నారు నెటిజన్లు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.