బండి బయటకు తీస్తున్నారా? అయితే జాగ్రత్త. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటే ఫైన్ల మోత మోగాల్సిందే. మోటార్ వాహనాల సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడింది. రాజ్యసభలో బిల్లు పాసైందంటే జరిమానాలు పెరగనున్నాయి. వాస్తవానికి 2017 ఏప్రిల్‌లోనే ఈ బిల్లుకు లోక్‌సభలో ఆమోదముద్ర పడింది. కానీ రాజ్యసభ ఆమోదం లేకపోవడంతో 16వ లోక్‌సభ ముగియగానే ఈ బిల్లు రద్దైంది. దీంతో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ బిల్లును మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో ఆమోదముద్ర పడ్డ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపితే కొత్త జరిమానాలు అమలులోకి వస్తాయి. మరి పాత, కొత్త జరిమానాలు ఎలా ఉన్నాయో ఈ చార్ట్ చూసి తెలుసుకోండి.
సెక్షన్ లేదా తప్పు | పాత జరిమానా | కొత్త ఫైన్ |
సాధారణ జరిమానా | రూ.100 | రూ.500 |
రహదారి నియంత్రణ నిబంధనల ఉల్లంఘన (177A) | రూ.100 | రూ.500 |
టికెట్ లేకుండా ప్రయాణం (178) | రూ.200 | రూ.500 |
అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం(179) | రూ.500 | రూ.2000 |
లైసెన్స్ లేకుండా వాహనాన్ని ఉపయోగించడం (180) | రూ.1000 | రూ.5000 |
లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం (181) | రూ.500 | కొత్త ఫైన్ రూ.5000 |
అర్హత లేకుండా డ్రైవింగ్ చేయడం (182) | రూ.500 | రూ.10,000 |
వాహనాలపై ఎక్కువ లోడ్ వేయడం (182B) | రూ.5000 | |
ఓవర్ స్పీడ్ (183) | రూ.400 | చిన్న వాహనాలకు రూ.1000, మీడియం ప్యాసింజర్ వాహనాలకు రూ.2000 |
ప్రమాదకరంగా డ్రైవ్ చేయడం(184) | రూ.1,000 | రూ.5000 వరకు |
డ్రంకెన్ డ్రైవింగ్ | రూ.2000 | రూ.10,000 |
రేసింగ్ (189) | రూ.500 | రూ.5,000 |
పర్మిట్ లేని వాహనాలు(192A) | రూ.5000 వరకు | రూ.10,000 వరకు |
సీట్ బెల్ట్ (194 B) | రూ.100 | రూ.1,000 |
ఎమర్జెన్సీ వాహనాలకు (అంబులెన్స్) దారి ఇవ్వక పోవడం (194E) | రూ.10,000 | |
టూవీలర్‌పై ఓవర్ లోడింగ్ (194 C) | రూ.100 | రూ.2,000. ఫైన్‌తో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు |
ఇన్స్యూరెన్స్ లేకుండా డ్రైవింగ్ (196) | రూ.1,000 | రూ.2,000 |
ప్యాసింజర్లను ఎక్కువగా ఎక్కించుకోవడం (194A) | అదనంగా ఉన్న ఒక్కో ప్యాసింజర్‌కు రూ.1000 |
Realme X: రియల్‌మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
ATM Card: ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి
PPF Rules: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తీసుకున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి
IRCTC: యూటీఎస్ యాప్‌లో ట్రైన్ పాస్... బుక్ చేయండి ఇలా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: TRAFFIC AWARENESS