Home /News /trending /

MOTOR VEHICLES ACT 2019 AND 63 CLAUSES TO BE IMPLEMENTED FROM SEPTEMBER 1 KNOW ABOUT REVISED TRAFFIC VIOLATION FINES SS

Traffic Fines: సెప్టెంబర్ 1 నుంచి మారే ట్రాఫిక్ ఫైన్స్ ఇవే...

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనుకునే వారికి రాత్రి 7 గంటల వరకే అనుమతి ఉంటుంది.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనుకునే వారికి రాత్రి 7 గంటల వరకే అనుమతి ఉంటుంది.

Traffic new fines | సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. మరి ఆ నిబంధనలేంటీ? డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎంతెంత జరిమానా చెల్లించాలి? ఆ వివరాలు తెలుసుకోండి.

    ట్రాఫిక్ ఫైన్స్... ఈ మాట వింటే సామాన్యుల గుండెలు అదిరిపోతున్నాయి. కారణం... ఇటీవల మారిన ట్రాఫిక్ జరిమానాలే. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టానికి సవరణలు చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి జరిమానాల వరకు మొత్తం 63 నిబంధనల్ని మార్చింది. ఇవే ఇప్పుడు సామాన్యుల్లో చర్చకు దారితీస్తున్న అంశాలు. పెరిగిన చలాన్లు, జరిమానాలు చూసి వణికిపోతున్నారు వాహనదారులు. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు 2019 పార్లమెంటులో ఆమోదం పొందిందని, చట్టంలో సవరించిన 63 నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించేశారు. దీంతో సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. మరి ఆ నిబంధనలేంటీ? డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఎంతెంత జరిమానా చెల్లించాలి? ఆ వివరాలు తెలుసుకోండి.


































































































     అపరాధం పాత జరిమానా కొత్త జరిమానా
     సాధారణ జరిమానా (177) రూ.100 రూ.500
     రహదారి నియంత్రణ నిబంధనల ఉల్లంఘన (177A) రూ.100 రూ.500
     టికెట్ లేకుండా ప్రయాణం (178) రూ.200 రూ.500
     అధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం(179) రూ.500 రూ.5000
     లైసెన్స్ లేకుండా వాహనాన్ని ఉపయోగించడం (180) రూ.1000 రూ.5000
     లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపడం (181) రూ.500 రూ.5000
     అర్హత లేకుండా డ్రైవింగ్ చేయడం (182) రూ.500 రూ.10,000
     వాహనాలపై ఎక్కువ లోడ్ వేయడం (182B) కొత్త రూల్ రూ.5000
     ఓవర్ స్పీడ్ (183) రూ.400 చిన్న వాహనాలకు రూ.1000, మీడియం ప్యాసింజర్ వాహనాలకు రూ.2000.
     ప్రమాదకరంగా డ్రైవ్ చేయడం(184) రూ.1,000 రూ.5000
     డ్రంకెన్ డ్రైవింగ్ (185) రూ.2000 రూ.10,000
     రేసింగ్ (189) రూ.500 రూ.5,000
     పర్మిట్ లేని వాహనాలు(192A) రూ.5000 వరకు రూ.10,000 వరకు
     ప్యాసింజర్లను ఎక్కువగా ఎక్కించుకోవడం (194A) కొత్త రూల్ అదనంగా ఉన్న ఒక్కో ప్యాసింజర్‌కు రూ.1000
     సీట్ బెల్ట్ ధరించకపోవడం (194 B) రూ.100 రూ.1,000
     ఎమర్జెన్సీ వాహనాలకు (అంబులెన్స్) దారి ఇవ్వక పోవడం (194E)  కొత్త రూల్ రూ.10,000
     టూవీలర్‌పై ఓవర్ లోడింగ్ (194 C) రూ.100 రూ.2,000. ఫైన్‌తో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు.
     ఇన్స్యూరెన్స్ లేకుండా డ్రైవింగ్ (196) రూ.1,000 రూ.2,000

     

    Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    LIC Jeevan Amar: రూ.10,800 ప్రీమియంతో రూ.1 కోటి బీమా... ఎల్ఐసీ కొత్త పాలసీ వివరాలివే

    IRCTC: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ

    IRCTC: రైలు గంట ఆలస్యంగా వస్తే క్యాష్‌బ్యాక్... ఐఆర్‌సీటీసీ ఆఫర్
    First published:

    Tags: TRAFFIC AWARENESS, Traffic rules

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు