అమ్మ తన బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో (Mother) మోస్తుంది. తన బిడ్డను కనే క్రమంలో ఎవరు భరించలేని నొప్పులను భరిస్తుంది. తమ బిడ్డలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. తన బిడ్డ సమాజంలో ఒక గొప్ప స్థానానికి ఎదగాలని ప్రతి క్షణం కలలు కంటుంది. ఒక్క నిముషం తన బిడ్డ కన్పించక పోతే ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఇక తల్లి ప్రేమ (Mothers love) నోరు ఉన్న మనుషుల్లోనే కాదు. మూగ జీవాలు కూడా తమ పిల్లల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలను కల్గి ఉంటాయి. ఎవరైన పొరపాటున తమ పిల్లల జోలికి వస్తే.. విశ్వరూపం చూపిస్తుంటాయి.
తమ కన్న ఎదుటివారు ఎంత బలవంతులుగా ఉన్న.. తమ పిల్లల మీద ప్రేమతో వారిని ఎదిరిస్తుంటారు. ఇక అమ్మ ప్రేమకు సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం మదర్స్ డే సందర్భంగా ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా (IPS officer Dipanshu Kabra) తన ట్విటర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా (viral video) మారింది.
— Dipanshu Kabra (@ipskabra) May 8, 2022
పూర్తి వివరాలు.. ఈ వీడియోలో ఒక దివ్యాంగురాలైన కన్నతల్లి తన బిడ్డ కోసం పడుతున్న తాపత్రయం కన్పిస్తుంది. ఒక తల్లికి పుట్టుకతోనే చేతులు (mother born without arms) లేవు. కానీ ఆ తల్లి ఏమాత్రం బాధపడలేదు. తన రెండు కాళ్లనే చేతులుగా మలుచుకుంది. తన బిడ్డకు కాళ్లతోనే అన్ని పనులు చేస్తుంది. కాళ్లతోనే బట్టలు తీసి, కొత్త బట్టలు తొడుగుతుంది.
ఇతర పనులు కూడా తన కాళ్లను ఉపయోగించుకుంటుంది. భగవంతుడు అన్నిచోట్ల ఉండలేక.. తల్లిని సృష్టించాడని చాలా మంది విశ్వసిస్తారు. తల్లి తన బిడ్డకోసం వృద్ధాప్యం వరకు కూడా తన ప్రేమను చూపిస్తు ఉంటుంది. ప్రపంచంలో ఏది మారిన తల్లి ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీని చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. తమ తల్లిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లి తన బిడ్డ పట్ల చూపుతున్న ప్రేమకు రెండు చేతులతో నమస్కరిస్తున్నామని కామెంట్ లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Happy mothers day, Mothers day, Viral Video