Mothers Day 2020 : నేడు మదర్స్ డే... అమ్మలకు శుభాకాంక్షల వెల్లువ....

Mothers Day 2020 : నేడు మదర్స్ డే... అమ్మలకు శుభాకాంక్షల వెల్లువ.... (credit - twitter - KB)

Mothers Day 2020 : మదర్స్ డే సందర్భంగా... ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అమ్మలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

  • Share this:
    Mothers Day 2020 : ఈ సృష్టికి మూలం అమ్మే. పుట్టే ప్రతి జీవికీ... దిక్సూచీ తల్లే. ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా... ప్రతి ఒక్కరూ... తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమ్మ గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ... అమ్మ తమకు చిన్నప్పటి నుంచి చేసిన సేవల్ని స్మరించుకుంటూ... అమ్మ కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ... విషెస్ చెబుతున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టిక్ టాక్... ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ మదర్స్ డే విషెస్‌తో నిండిపోతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అమ్మ ప్రేమను చాటుకుంటూ... పోస్టులు పెడుతున్నారు.


    ఈ సృష్టిలో నిస్వార్థమైన ప్రేమను చాటేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మంటే అందరికీ ఇష్టం. పుట్టినప్పటి నుంచి... లాలించి, ఆడించి, పాడించి, గోరు ముద్దలు పెట్టి... వేలు పట్టి నడిపించే అమ్మకు ఏమిచ్చినా తక్కువే. అమ్మ చేసిన మేలును మర్చిపోవడం అసాధ్యం అంటూ అమ్మను స్మరించుకుంటున్నారు అంతా.


    ఓ తల్లిగా, ఓ ఫ్రెండుగా, ఓ మార్గదర్శిగా... ఇలా మన జీవితంలో ప్రతి మలుపులో వెన్ను తట్టి ప్రోత్సహించేది అమ్మే. ఆమె సలహాలో ధైర్యం ఉంటుంది. ఆమె మాటలో ఓదార్పు ఉంటుంది. మమకారాన్ని పంచుతూ... మమతను చాటుతూ... అమ్మ ఆలనా పాలనలో... ఎదుగుతూ... భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం ఓ మధురమైన అనుభవం.


    తల్లికి తన పిల్లలే ప్రపంచం. వారి ఎదుగుదలే తన ఆశయం. సమసమాజ నిర్మాణంలో అమ్మ పాత్ర అనిర్వచనీయం. బాధల్ని భరిస్తూ... కష్టాల్లో కొవ్వొత్తిలా కరుగుతూ... కన్నీటిని కళ్లలోనే దాచేస్తూ... పైకి చిరునవ్వులు చిందించే అమ్మతనాన్ని ఎంతలా వర్ణించినా తక్కువే.


    మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, ప్రాణికోటిలో... అమ్మ తనానికి మించినది మరొకటి లేదు. తన కొంగుచాటున బిడ్డల్ని కాపాడుతూ... వారి ఉన్నతి కోసం తపించేది మాతృమూర్తి మాత్రమే. తను తిన్నా తినకపోయినా... పిల్లల ఆకలి తీర్చేందుకు ఆరాటపడేది అమ్మ మాత్రమే.


    మన అడుగుల్లో అమ్మ ఉంటుంది. జ్ఞాపకాల్లో జ్ఞప్తికి వస్తుంది. మన ప్రతి మలుపులో కనిపించేది అమ్మే. అనంతమైన అమ్మ ప్రేమకు మనం ఏమిచ్చినా తక్కువే. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆ మాతృమూర్తికి... అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా... న్యూస్18 సమర్పిస్తున్న సవినయంగా తెలుపుతోంది నమస్సుమాంజలి.

    Published by:Krishna Kumar N
    First published: