హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Mothers love: శభాష్ జ్యోతి.. వట్టి చేతులతో చిరుతతో పోరాడిన తల్లి.. ఎందుకో తెలుసా..?

Mothers love: శభాష్ జ్యోతి.. వట్టి చేతులతో చిరుతతో పోరాడిన తల్లి.. ఎందుకో తెలుసా..?

తన బిడ్డను పులి బారినుంచి కాపాడుకున్న తల్లి

తన బిడ్డను పులి బారినుంచి కాపాడుకున్న తల్లి

Maharashtra: తన గారాల బిడ్డకు వాకిట్లో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తుంది. అన్నం ముద్దలుగా కలుపుతు.. కథలు చెప్పుకుంటూ చిన్ని చిన్ని ముద్దలు పెడుతుంది. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది.

అడవికి దగ్గరలో ఉండే గ్రామాల మీద తరచుగా పులులు, చిరుతపులులు,ఎలుగు బంట్లు తదితర క్రూర జంతువులు (Cruel animals)  దాడులు చేస్తుంటాయి. సాధారణంగా క్రూర జంతువులు ఆహారం, నీటి జాడ కోసం సమీపంలోని దారితప్పి సమీపంలోని గ్రామాలకు వస్తుంటాయి. ఈ క్రమంలో వాటికి మనుషులు కనపడితే.. వారిపై దాడి చేస్తాయి. గతంలో అనేక సందర్బాలలో క్రూర జంతువులు మనుషులు, చిన్న పిల్లలపై దాడిచేసి సంఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్ని సార్లు.. క్రూర జంతువులు మనుషులను పొట్టనబెట్టుకుంటే.. మరికొన్ని సార్లు జంతువులు కూడా మనుషుల చేతిలో చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని సార్లు.. తమ వారిపై క్రూర జంతువులు దాడికి పాల్పడినప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడుకున్న అనేక సందర్భాల ఘటనలు వైరల్ అయ్యాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఈ ఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటు చేసుకుంది. చంద్రపూర్ (chandrapur) అడవి ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది. అయితే, దుర్గాపూర్ ప్రాంతంలో గత మంగళవారం (8తేది)న ఒక షాకింగ్ ఘటన జరిగింది. దుర్గాపూర్ గ్రామంలో.. జ్యోతి పుప్పాళ్వార్ (Jyothi pushpalwar) అనే తల్లి తన బిడ్డకు రాత్రిపూట వాకిట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతుంది. ఆ గ్రామంలో అడవికి కాస్త దగ్గరగా ఉంటుంది. అప్పుడు ఒక చిరుతపులి మెల్లగా (Tiger attack) వచ్చింది. పాపం.. తల్లి తన బిడ్డకు అన్నం పెడుతుంది. ఆమె పులిని గమనించలేదు. పులి ఒక్కసారిగా పసిబిడ్డపై దాడిచేసింది. ఆమె దవడ భాగంను పట్టుకుంది. లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. ఈ పరిణామంతో ఆమె షాక్ కు గురయ్యింది.

వెంటనే తేరుకొని తన కూతురిని కాపాడుకోవాలని బలంగా అనుకుంది. చిరుత పులిపై తన చేతులతో బలంగా కొట్టడం చేసింది. ఆ తర్వాత.. అక్కడే ఉన్న కర్రలు తీసుకుంది. గట్టిగా అరుస్తూ.. పులిపై దాడిచేసింది. పులి.. వెంటనే తన నోటి నుంచి పాపను వదిలేసింది. భయపడిపోయి అక్కడ నుంచి పారిపోయింది. వెంటనే చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. మహిళా ఏమాత్రం భయపడిపోయిన.. ఆమె కూతురు దక్కెది కాదు.. ప్రస్తుతం ఆమె చూపిన సమయస్పూర్తీ, ధైర్యం వలన ఆమె కూతురు ప్రాణాలతో దక్కింది. పసిపాపకు.. చిన్న పాటి గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

గ్రామస్థులు చిరుతపులిని చంపాలని అటవీ అధికారులకు (Forest officers) డిమాండ్ చేశారు. 10 మంది ఫారెస్టు సిబ్బందిని బంధించారు. ఇప్పటి వరకు ఆ గ్రామంలో పులి దాడిలో 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు కూడా చిరుతపులిని చంపమని అధికారికంగా ఫారెస్టు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు రక్తపు రుచి మరిగిన చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కన్న బిడ్డ కోసం తల్లిపడిన ఆరాటానికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

First published:

Tags: Forest, Leopard attack, Maharashtra

ఉత్తమ కథలు