రూ.50000 బొమ్మలకు ఆర్డరిచ్చిన పిల్లలు... క్రెడిట్ కార్డ్ బిల్లు చూసి షాకైన తల్లి

పిల్లలు చేసే పనులు ఒక్కోసారి తల్లిదండ్రులకు షాకిస్తాయి. ఈ ఘటనలో కూడా అదే జరిగింది. క్రిస్మస్ వస్తున్న సందర్భంగా ఆ పిల్లలు చేసిన పని తల్లిని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

news18-telugu
Updated: December 22, 2019, 6:25 AM IST
రూ.50000 బొమ్మలకు ఆర్డరిచ్చిన పిల్లలు... క్రెడిట్ కార్డ్ బిల్లు చూసి షాకైన తల్లి
రూ.50000 బొమ్మలకు ఆర్డరిచ్చిన పిల్లలు... క్రెడిట్ కార్డ్ బిల్లు చూసి షాకైన తల్లి (credit - FB - Veronica Estell)
  • Share this:
అమెరికా, వాషింగ్టన్‌లో జరిగిందీ ఘటన. ఇద్దరు పిల్లలు... తమ తల్లి క్రెడిట్ కార్డు తీసుకొని... దాని ద్వారా... భారీ ఎత్తున బొమ్మలకు ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చేశారు. అదే రోజు ఆ బొమ్మలు ఇంటికొచ్చాయి. అన్ని బొమ్మల్ని చూసిన తల్లి వెరొన్సికా... తాను ఆర్డర్ ఇవ్వలేదని తెలిపింది. లేదు ఆర్డర్ ఇచ్చారంటూ వివరాలు డెలివరీ బాయ్ చెప్పడంతో... ఆమె వెంటనే క్రెడిట్ కార్డు చెక్ చేసుకుంది. అందులో 700 (రూ.50000) డాలర్లతో బొమ్మలకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుసుకొని షాకైంది. అమ్మ బాబోయ్... ఒక్కసారిగా ఇంత ఖర్చు పెట్టి బొమ్మలు కొనేశారా అనుకొని లబోదిబోమంది. ఇందుకు సంబంధించిన వివరాలతో ఆమె ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పటికే దానికి 85 వేల లైక్స్, 75వేల కామెంట్లూ వచ్చాయి. ఇదంతా ఎలా సాధ్యమైందంటే... జనరల్‌గా ఆమె పిల్లల కోసం ఓ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో బొమ్మలు కొనేవారు. అది చూసిన పిల్లలు... తల్లి లేని టైమ్ చూసి... అదే పోర్టల్ తెరిచి... బొమ్మలు కొనేశారు. ఈ వీడియో చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చిందా తల్లి. క్రెడిట్ కార్డ్ మోసానికి పాల్పడినందుకు పోలీసులకు కంప్లైంట్ చేస్తాననీ, పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తారనీ పిల్లలతో అంటే... ఆ పిల్లలు ఏడుపు ముఖాలు పెట్టడం నెటిజన్లను నవ్విస్తోంది.First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు